Begin typing your search above and press return to search.

ఈసారి ఇద్దరిలో పైచేయి సాధించేదెవరు..?

By:  Tupaki Desk   |   10 Nov 2022 2:30 AM GMT
ఈసారి ఇద్దరిలో పైచేయి సాధించేదెవరు..?
X
సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరియు సెన్సేషనల్ ఎస్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొన్నేళ్లుగా తమ సంగీతంతో మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా అలరిస్తున్న వీరిద్దరూ.. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరూ వచ్చే సంక్రాంతికి పోటీ పడబోతున్నారు.

2023 సంక్రాంతి సందర్భంగా 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీర సింహారెడ్డి' సినిమాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. హీరోల మధ్యే కాదు ఈ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా ఈ పోటీ ఉండబోతుంది. చిరంజీవి చిత్రానికి దేవిశ్రీ సంగీతం సమకూరిస్తే.. బాలయ్య సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.

గత కొన్నాళ్లుగా ఇరువురి మధ్య ఆహ్లాదకరమైన పోటీ కొనసాగుతూ వస్తుండగా.. ఇప్పుడు ఇద్దరు పాటలు అందించిన సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇద్దరు సంగీత దర్శకులలో ఈసారి పైచేయి సాధించేదెవరనే చర్చలు జరుపుతున్నారు.

నిజానికి దశాబ్దానికి పైగా టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా డీఎస్పీ.. థమన్ ఆధిప‌త్యం మొదలైన తర్వాత రేసులో కాస్త వెనకబడిపోయారనే కామెంట్స్ చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. రెండేళ్ళ క్రితం సంక్రాంతికి ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. అందులో దేవిశ్రీ పై తమన్ కాస్త పైచేయి సాధించాడని చెప్పాలి.

2020 పొంగల్ కు రిలీజైన మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి దేవీ సూపర్ హిట్ ఆల్బమ్ అందించగా.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించిన థమన్ సినిమా ఘన విజయం సాధించడంలో మేజర్ రోల్ పోషించారు.

అయితే గతేడాది చివర్లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ రైజ్ అయ్యాడు.. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో తన పాటలతో ఊపేసాడు. మరోవైపు అదే సమయంలో 'అఖండ' సినిమాను అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో నిలబెట్టాడు థమన్.

ఇలా పోటాపోటీగా నిలుస్తున్న వీరిద్దరి మధ్య ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఇప్పటి వరకూ 'వాల్తేరు వీరయ్య' - 'వీర సింహారెడ్డి' సినిమాల నుంచి ఒక్క సాంగ్ కూడా రిలీజ్ అవ్వలేదు కాబట్టి.. ఇంకా కంపారిజన్స్ స్టార్ట్ అవ్వలేదు. కానీ టీజర్స్ ద్వారా వారి బీజీఎమ్ బయటకు వచ్చింది. రెండిటికీ ఒకేరకమైన స్పందన వచ్చింది.

గతంలో మెగాస్టార్ కు ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన రికార్డ్ దేవిశ్రీ ప్రసాద్ కు ఉంది. మరోవైపు నటసింహంతో చేసిన రెండు సినిమాలకూ తమన్ మంచి మ్యూజిక్ అందించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ హీరోల సినిమాలకు బాక్సులు బద్దలయ్యే ఆల్బమ్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. మరి వీరిద్దరిలో ఈసారి పండక్కి ఎవరు నెగ్గుతారో చూడాలి.

ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' తో పాటుగా 'పుష్ప: ది రూల్' - 'సూర్య42' సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నారు. అలానే హిందీలో 'దృశ్యం 2' 'సర్కస్' 'కిసీ కా భాయ్.. కిసీ కా జాన్' చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో తెలియదు కానీ 'భవదీయుడు భగత్ సింగ్' కూడా దేవీ ఖాతాలోనే ఉంది.

ఎస్ థమన్ విషయానికొస్తే.. 'వీర సింహా రెడ్డి' తో పాటుగా SSMB28 - NBK108 - 'అనగనగా ఒక రాజు' సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. అలానే RC15 మరియు 'రామ్‌-బోయపాటి' వంటి పాన్ ఇండియా చిత్రాలకు కూడా మ్యూజిక్ సమకూరుస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.