Begin typing your search above and press return to search.
కన్నడ అర్జున్ రెడ్డి ఎవరో ?
By: Tupaki Desk | 26 Jun 2019 7:39 AM GMTటాలీవుడ్ లో డిఫరెంట్ లవ్ క్లాసిక్ గా మిగిలిపోయిన అర్జున్ రెడ్డి మిగిలిన భాషల్లోనూ అదే ఫలితాన్ని అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే హిందీ రీమేక్ కబీర్ సింగ్ సంచలనం రేపుతోంది. మీడియా విమర్శలకు భిన్నంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టి ఇంకా రెండో వారం రాకుండానే బ్లాక్ బస్టర్ ముద్ర వేయించుకుంది. ఇక తమిళ్ లో విక్రమ్ కొడుకు ధృవ్ ని పరిచయం చేస్తూ సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరిశాయ డెబ్యూ మూవీగా రూపొందిన ఆదిత్య వర్మ కూడా రిలీజ్ కూడా రెడీ అవుతోంది.
ఇప్పటికే క్రేజీ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయని చెన్నై టాక్. బాలా దర్శకత్వంలో ముందు తీసిన వెర్షన్ ని స్క్రాప్ కింద పక్కన పారేసి మళ్ళి మొదటి నుంచి తీయడం సౌత్ ఇండస్ట్రీలోనే సెన్సేషన్ అయ్యింది. ఆ అంచనాలు ఒత్తిడికి తగ్గట్టే ఆదిత్య వర్మ రూపొందిందని చెబుతున్నారు. అయితే విడుదలయ్యాక కానీ దీని గురించి కామెంట్ చేయడానికి లేదు
ఇక బాలన్స్ ఉన్న కన్నడలోనూ దీని రీమేక్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత ఎస్ నారాయణ్ హక్కులు కొన్నట్టుగా తెలిసింది. హీరో ఇంకా డిసైడ్ కాలేదు. శాండల్ వుడ్ ఫ్యాన్స్ మాత్రం ఇది యష్ తో తీయాలని కోరుతున్నారు. రీమేక్ ల మీద ఆసక్తి చూపని కెజిఎఫ్ హీరో దీని గురించి ఏమంటారో చూడాలి. అయితే నిర్మాత మాత్రం కొత్త హీరోతో తీయాలనే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ఎవరైనా యూత్ స్టార్ హీరో ముందుకు వచ్చినా రెడీ అంటున్నారు. ఇది ఓ కొలిక్కి రావడానికి రెండు మూడు నెలల టైం పట్టొచ్చు.