Begin typing your search above and press return to search.
కౌబాయ్ మూవీస్ నెక్స్ట్ చేసేది ఎవరు?
By: Tupaki Desk | 14 Nov 2022 5:30 PM GMTటాలీవుడ్ సినీ చిత్రలో కౌబాయ్ సినిమాలకు ప్రత్యేక స్థానం వుంది. ఈ తరహా చిత్రాలకు 1971లో శ్రీకారం చుట్టిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై జి. ఆదిశేషగిరిరావు నిర్మాతగా కె.ఎస్. ఆర్. దాస్ తెరకెక్కించిన హాలీవుడ్ మూవీస్ ఫర్ ఫ్యూ డాలర్స్ మోర్, ద గుడ్ ద బ్యాడ్ అండ్ ద లగ్లీ, మోకెన్నస్ గోల్డ్ వంటి సినిమాల స్ఫూర్తితో సూపర్ స్టార్ కృష్ణ సాహసోపేతంగా చేసిన మూవీ `మోసగాళ్లకు మోసగాడు`. తెలుగులో వచ్చిన తొలి కౌబాయ్ ఫిల్మ్ గా చరిత్ర సృష్టించింది.
ఆ తరువాత భాను చందర్, సుమన్ ల కలయికలో `మెరుపు దాడి`, అర్జున్ కౌబాయ్ నెం.1 వంటి సినిమాలోచ్చాయి కానీ ఆ రేంజ్ లో మెస్మరైజ్ చేయలేకపోయాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన `కొదమసింహం` మాత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. సుధాకర్, సుడిగాలి పాత్రలో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు క్యారెక్టర్, గజపతి పాత్రలో నటించిన కన్నడ ప్రభాకర్, బిజిలిగా నటించిన రాధ, మేయర్ కూతురిగా నటించిన సోనమ్ ల పాత్రలు, రాజ్ కోటి సంగీతం ఇప్పటికీ కౌబాయ్ చిత్రాలని ఇష్టపడే ప్రేక్షకుల్ని వెంటాడుతూనే వుంటాయి.
ఆ చిరువాత కౌబాయ్ పాత్రలో మెరిసిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. జయంత్ సీ. పరాన్జీ ప్రాణం పెట్టి ఈ మూవీని తెరకెక్కించాడు. లీసారే, బిపాషా బసు హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీ అప్పట్లో భారీ క్రేజ్ ని దక్కించుకున్నా ఎందుకో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా గురించి ఇప్పటికీ దర్శక నిర్మాత జయంత్ సీ పరాన్జీ గొప్పగా చెబుతూనే వున్నాడు. రీసెంట్ గా ఓ టీవీ ఛానల్ తో ముచ్చటించిన జయంత్ తను తెరకెక్కించిన సినిమాల్లో `టక్కరి దొంగ` ఇప్పటికి ప్రత్యేకమైనదేనని చెబుతున్నారు.
సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా దర్శకుడిగా నాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టిందని చెబుతున్నారాయన. తను చేసిన `ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్, లక్ష్మీ నరసింహా, శంకర్ దాదా ఎంబీ బిఎస్ వంటి హిట్ సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో తనకు లభించిందని ఇప్పటికీ తనని `టక్కరి దొంగ` డైరెక్టర్ అని ప్రేక్షకులు పిలుస్తుంటారని జయంత్ చెప్పెకొచ్చారు.
త్వరలో రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ చేయబోతున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీలో కౌబాయ్ తరహా పాత్రలో కనిపిస్తాడా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. అయితే మహేష్ తరువాత ఇప్పుడున్న హీరోల్లో కౌబాయ్ క్యారెక్టర్ కు మెగా హీరో రామ్ చరణ్ బాగా సూటవుతాడనే టాక్ ఆడియన్స్ లో వినిపిస్తోంది. మరి ఏ డైరెక్టరైనా తనతో కౌబాయ్ సినిమాని ప్లాన్ చేస్తాడేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.