Begin typing your search above and press return to search.
సమఉజ్జీల సమరం : విజేత ఎవరు
By: Tupaki Desk | 17 Dec 2018 2:30 PM GMTచాలా రోజుల తర్వాత ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ క్రేజ్ ఉన్న సినిమాల పోటీ తో కళకళలాడనుంది. టాక్సీ వాలా తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ లేక డీలాగా ఉన్న టికెట్ కౌంటర్ల కు కు ఇది ఊపునిచ్చేదే. నవంబర్ ఆఖరున 2.0 వచ్చి సందడి చేసింది కానీ డబ్బింగ్ మూవీ కావడంతో పాటు ఆశించిన రేంజ్ కి అది చేరుకోకపోవడంతో చాలా ఏరియాల్లో నష్టాలే మిగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వర్తమానానికి వస్తే శర్వానంద్ సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన పడి పడి లేచే మనసు యూత్ ని తనవైపుకు ఆకట్టుకుంటోంది. శర్వా కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్లీన్ ఇమేజ్ ఓపెనింగ్ రోజున ప్లస్ కానుంది.
ఇక వరుణ్ తేజ్ తో సంకల్ప్ రెడ్డి రూపొందించిన అంతరిక్షం డిఫరెంట్ జానర్ అయినప్పటికీ మొదటి రోజు మెగాభిమానుల అండదండలు పుష్కలం గా ఉంటాయి. ఒక వేళ టాక్ బాగుంటే డీసెంట్ ఫిగర్స్ తో పాటు రెండో రోజు నుంచే వసూళ్ల ప్రభంజనం మొదలవుతుంది. ఫిదా-తొలిప్రేమ లు ఫస్ట్ డే కంటే టాక్ బాగా వచ్చాక పుంజుకున్నాయి. స్పేస్ థ్రిల్లర్ కాబట్టి పిల్లలు దీనికే ఓటేస్తారని యూనిట్ నమ్మకం. ఇదిలా ఉండగా కన్నడ హీరో యాష్ తో రూపొందిన కెజిఎఫ్ మొదట్లో ఏమో కానీ విడుదల దగ్గర పడే కొద్దీ హైప్ పెంచుకుంటోంది. కోలార్ బంగారు గనుల మాఫియా బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ పీరియాడికల్ మూవీ మీద కర్ణాటక లో విపరీతమైన ఫీవర్ నడుస్తోంది. హిట్ టాక్ వచ్చిందా ఇక్కడా పికప్ కావడం తథ్యం. తేడా కొడితే సాయంత్రానికే దుకాణం వీకైపోతుంది.
ఇక ధనుష్ మారి 2 సందడి అసలు కనిపించడం లేదు. ఇప్పటికి ఒక్క ఆడియో సింగల్ మాత్రమే రిలీజ్ చేసారు. 21 విడుదల ఫిక్స్ అన్నారు కానీ ఆ స్థాయి హడావిడి ప్రస్తుతానికి లేదు. ఇవి చాలవు అన్నట్టు షారుఖ్ ఖాన్ జీరో మల్టీ ప్లెక్సుల్లో గట్టి పాగా వేసి ఏ సెంటర్స్ లో ధీటైన పోటీ ఇవ్వబోతోంది. కర్ణాటక తరహా లో మన దగ్గర తమిళ సినిమాలు రిలీజ్ చేసే ప్రాక్టీస్ లేదు కానీ అవి కూడా ఉంటె మరో నాలుగు తోడయ్యేవి. థియేటర్ల కౌంట్ తోనే మొదలైన ఈ యుద్ధం లో విజేతలు ఎందరో శుక్రవారం ఉదయం తేలిపోతుంది.