Begin typing your search above and press return to search.
బ్రదర్స్ మెగా క్లాష్ : ఎవరు విన్నర్ ?
By: Tupaki Desk | 2 Jan 2019 7:09 AM GMTమెగా కాంపౌండ్ హీరోలు క్లాష్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. సాధ్యమైనంత మేరకు అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పటిదాకా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అయితే కొన్ని తప్పని సరి పరిస్థితులు వీటిని ఆపలేకపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కేవలం ఒక్క రోజు గ్యాప్ లో ఇంటెలిజెంట్-తొలిప్రేమలు విడుదలైనప్పుడు మెగా ఫ్యాన్స్ మధ్య కొంత గందరగోళం నెలకొంది. అయితే ఒకటి పూర్తిగా డిజాస్టర్ కావడంతో వసూళ్ళ మీద పరస్పర ప్రభావం లేకపోయింది. అయితే తేజు వరుణ్ ల వరసలు వేరు.
ఇప్పడు అన్నదమ్ముల వంతు వచ్చింది. 11న రామ్ చరణ్ వినయ విధేయ రామ వస్తుండగా ఇరవై నాలుగు గంటలు గడవకుండానే 12న వరుణ్ తేజ్ ఎఫ్2 వచ్చేస్తుంది. తనకు ఇలా అన్నయ్యతో పోటీ పడటం ఇష్టం లేదని వరుణ్ తేజ్ గతంలోనే చెప్పాడు. అయితే దిల్ రాజు నిర్మాత కావడం వెంకటేష్ మరో హీరోగా ఉండటంతో నిర్ణయాన్ని ప్రభావితం చేసే శక్తి వరుణ్ కు లేదు. అందుకే మౌనాన్నే ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే అతి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. మార్కెట్ పరంగా ఇమేజ్ పరంగా రామ్ చరణ్ తో సరితూగే రేంజ్ లో వరుణ్ తేజ్ లేడు కాని ఇలా కేవలం ఒక్క రోజు గ్యాప్ తో క్లాష్ కావడం అభిమానులను ఇబ్బంది పెట్టేదే.
సంక్రాంతి సీజన్ కాబట్టి సాధారణ రోజులతో పోలిస్తే మంచి వసూళ్లు వస్తాయి కాని మరో యాంగిల్ లో ఆలోచిస్తే మాస్ మసాలాలు పుష్కలంగా ఉండే విధేయ రాముడి వైపే ఫ్యాన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులు టర్న్ అవుతారు. ఇది వరుణ్ కు ఇబ్బంది కలిగించే పరిణామం. అండగా వెంకీ ఉన్నప్పటికీ మొత్తంగా మార్కెట్ ని ప్రభావితం చేయడం అంత ఈజీ కాదు. సో అన్నదమ్ముల సవాల్ ని తలపిస్తున్న ఈ పోటీలో విజేత ఎవరు అనేది గెస్ చేయడం కరెక్ట్ కాదు కాని అన్నయ్యతో తలపడటం వల్ల తమ్ముడిగా వరుణ్ కే కాస్త ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి వెంకీ సహాయంతో దీన్ని ఎలా ఎదురుకుంటాడో చూడాలి