Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' లో వల్గర్ పదాలు..!
By: Tupaki Desk | 6 April 2021 10:39 AM GMTప్రస్తుతం సినిమాలలో అసభ్య పదాలు అనేవి సర్వసాధారణం అయ్యాయి. కాకపోతే సినిమాలలో అశ్లీల సన్నివేశాలు మితిమీరిన బూతు పదాలకు కత్తెర వేయడానికి సెన్సార్ బోర్డ్ ఉంటుంది. సిగరెట్లు తాగడం.. మద్యం సేవించడం లాంటి సీన్స్ వచ్చినపుడు కచ్చితంగా కింద డిస్‌క్లెయిమర్స్ వేయమని సూచిస్తుంది. అలానే అభ్యంతరకరమైన పదాలు వచ్చినప్పుడు వాటిని మ్యూట్ చేయమని చెబుతుంది. కట్ చేయబడిన సన్నివేశాలు - మ్యూట్ చేసిన పదాలను సర్టిఫికెట్ లో పొందుపరిచి అది ఫ్యామిలీ మరియు పిల్లలతో కలిసి చూసేదా కదా అని ప్రేక్షకులకు తెలియజేస్తుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సి ఉంటుంది కాబట్టి అసభ్య పదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే లేటెస్టుగా 'వకీల్ సాబ్' సినిమాకి 'U/A' సెన్సార్ సర్టిఫికేట్ దక్కింది. సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం "వకీల్ సాబ్" లో ఉన్న అసభ్య పదాలను ప్రస్తావిస్తూ వాటికి కత్తెర వేయమని సూచించినట్లు తెలుస్తోంది. 'బిచ్' 'లం**డ' వంటి పదాలను తొలగించమని కోరగా.. మేకర్స్ వాటిని కట్ చేయకుండా మ్యూట్ చేశారు. అలానే 'కింద నువ్వు చూసుకో.. పైన నేను చూసుకుంటా' 'వ్యభిచారం' 'లం**లు' 'f**king' 'వేశ్యలు' వంటి పదాలను కూడా 'వకీల్ సాబ్' లో మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రేపు సినిమాలో ఈ పదాలు వినిపించకపోయినా నటీనటుల లిప్ రీడింగ్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఇలాంటివి ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇబ్బందిగా అనిపిస్తాయేమో చూడాలి.
కాగా, పవన్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు - బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఇది 'పింక్' సినిమా రీమేక్ గా రూపొందింది. ఇందులో పవన్ కు జోడీగా శృతి హాసన్ నటించగా.. నివేదా థామస్ - అంజలి - అనన్య - ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.