Begin typing your search above and press return to search.

సంక్రాంతి రిలీజ్… మొదటి రోజు ఎవరి కలెక్షన్స్ ఎంతంటే? 

By:  Tupaki Desk   |   15 Jan 2023 3:30 AM GMT
సంక్రాంతి రిలీజ్… మొదటి రోజు ఎవరి కలెక్షన్స్ ఎంతంటే? 
X
ఈ ఏడాది సంక్రాంతి బరిలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్ పై పోటీ పడగా, తమిళంలో అజిత్, విజయ్ పోటీ పడ్డారు. అక్కడ ఆ రెండు సినిమాలకి ఎవరేజ్ టాక్ వచ్చింది. ఇక తెలుగులో వీరసింహారెడ్డికి సెకండ్ డే ఎవరేజ్ టాక్ వచ్చింది. వాల్తేర్ వీరయ్య మూవీకి హిట్ టాక్ వచ్చింది. చిరంజీవి గత సినిమాల కంటే వాల్తేర్ వీరయ్య సినిమా సూపర్ గా ఉందనే మాట వినిపిస్తుంది. లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ రాబట్టడం పక్కా అనే మాట వినిపిస్తుంది.

సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూసాం అని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వీరసింహారెడ్డికి కూడా ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తుంది. రెగ్యులర్ ఆడియన్స్ నుంచి మాత్రం ఎవరేజ్ టాక్ వస్తుంది. ఇక వారసుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకి కూడా ఎవరేజ్ టాక్ వచ్చింది. దీనికి కారణం గతంలో ఇలాంటి కంటెంట్ తో చాలా సినిమాలు రావడమే. ఇక తెగింపు మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన వారసుడు మూవీని డామినేట్ చేయలేకపోయింది.

ఇదిలా ఉంటే ఈ నాలుగు సినిమాలు మొదటి రోజు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే టాప్ లో బాలకృష్ణ ఉండటం విశేషం. బాలకృష్ణ ముందు సినిమా అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ హైప్ వీర సింహారెడ్డికి కూడా కంటిన్యూ అయ్యింది. దీంతో ఫస్ట్ డే ఈ మూవీ 50 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక చిరంజీవి ముందు సినిమాలు గాడ్ ఫాదర్, ఆచార్య సినిమాలు అనుకున్న స్థాయిలో ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయాయి.

దీంతో ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ 49.1 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక వారసుడు మూవీ 47.52 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అది తమిళంలోనే మాత్రమే. రెండు భాషలలో ఒకే సారి రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా ఈ మూవీ 50 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసేది. ఇక అజిత్ తెగింపు అన్నిటికంటే తక్కువగా 41 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే ఈ మూవీకి ఇప్పటికే డివైడ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ రాకపోవచ్చు. మొత్తానికి ఈ నలుగురు స్టార్ హీరోలలో మొదటి రోజు కింగ్ గా బాలకృష్ణ నిలిచాడు. అయితే లాంగ్ రన్ లో ఈ హైప్ కలెక్షన్స్ ని ఎవరు కొనసాగిస్తారు అనేదానిని బట్టి సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.