Begin typing your search above and press return to search.

కాజ‌ల్ కుమారుడు ఎవ‌రి పోలిక..? క్లారిటీ ఇచ్చిన నిషా!

By:  Tupaki Desk   |   22 April 2022 4:30 PM GMT
కాజ‌ల్ కుమారుడు ఎవ‌రి పోలిక..? క్లారిటీ ఇచ్చిన నిషా!
X
టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌ల్లైన సంగ‌తి తెలిసిందే. మంగళవారం ఉద‌యం పండంటి మ‌గ బిడ్డ‌కు ఆమె జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని మొద‌ట నిషా అగ‌ర్వాల్ వెల్ల‌డించ‌డంతో.. కాజల్‌, ఆమె భర్త గౌతమ్ కిచ్లూల‌కు అభిమానులు, సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

ప్ర‌స్తుతం పేరెంట్స్ హోదా పొందడంతో ఫుల్ ఖుషీలో ఉన్న కాజ‌ల్ దంప‌తులు.. త‌మ ముద్దుల త‌న‌యుడికి 'నీల్ కిచ్లూ' అని నామకరణం కూడా చేసేశారు. దీంతో అంద‌రూ నీల్ కిచ్లూను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ చెల్లెలు నిషా అగ‌ర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదిగా త‌న ఫాలోవ‌ర్స్‌తో చిట్ చాట్ చేసింది. ఈ చిట్ చాట్ సెష‌న్ లో నెటిజ‌న్లు చాలా వ‌ర‌కు కాజ‌ల్ గురించే ప్ర‌శ్నించ‌గా.. అన్నిటికీ నిషా ఓపిగ్గా స‌మాధానాలు ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ 'నీల్ ఎవ‌రి పోలిక‌..?' అని ప్ర‌శ్నించాడు. అందుకు నిషా ఆస‌క్తిక‌ర జ‌వాబు ఇచ్చింది.

ఇంత‌కీ ఆమె ఏం చెప్పిందంటే.. 'అది చెప్ప‌డం చాలా క‌ష్టం. కొన్నిసార్లు కాజల్ లా ఉంటాడు. మరు క్షణమే గౌతమ్ లా అనిపిస్తారు. నేను నిజంగా చెప్పలేను. కానీ, నీల్ ఎంతో ముద్దొస్తున్నాడు' అని తెలిపింది. మ‌రో నెటిజ‌న్ నీల్ ఫొటో మీ ద‌గ్గ‌ర ఉంటే షేర్ చేయ‌మ‌ని కోరాడు.

అందుకు నీషా బదులిస్తూ.. నీల్ ఫోటో నా దగ్గర ఉంది కానీ, పోస్ట్ చేయనని చెప్పింది. అలాగే కాజ‌ల్ ది నార్మల్ డెలివరీ అని కూడా ఈ చిట్ చాట్ సెష‌న్ లో నిషా పేర్కొంది.

కాగా, 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కాజ‌ల్‌.. 'చందమామ'తో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్ ను ద‌క్కించుకున్న కాజ‌ల్‌.. కెరీర్ డౌన్ అవ్వ‌క‌ముందే ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. కుటుంబ‌స‌భ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల న‌డుమ‌ 2020 అక్టోబర్‌లో ముంబై వేదిక‌గా వీరి వివాహం జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేసిన కాజ‌ల్.. గ‌త ఏడాది గ‌ర్భం దాల్చింది. అప్ప‌టి నుంచీ ఈ భామ సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకుంది.