Begin typing your search above and press return to search.
‘రంగస్థలం’ విలన్ ఆయన కాదు ఈయన
By: Tupaki Desk | 28 March 2018 10:25 AM GMT‘రంగస్థలం’ సినిమా విడుదలకీ ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా... ఎప్పుడెప్పుడు చూసేద్దామా... అని చెర్రీ అభిమానులతో పాటు, సుక్కూ అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విడుదల సమయం దగ్గర పడేకొద్దీ, సినిమా స్టోరీ ఇదేనంటూ రకరకాల ఊహగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు సినిమాలో అసలు విలన్ ఎవరబ్బా అంటూ పెద్ద చర్చే జరుగుతోంది.
‘రంగస్థలం’ ట్రైలర్ చూసినప్పుడు తెల్ల గడ్డం - పిల్లి కళ్లతో క్రూరంగా కనిపిస్తున్న జగపతిబాబే విలన్ అనుకున్నారు. ఆయన సినిమాలో ‘రంగస్థలం’ గ్రామానికి ప్రెసిడెంట్ గా నటిస్తున్నాడని ట్రైలర్ లోనే తెలియడంతో విలన్ అతనే అని ఫిక్స్ అయిపోయారు. అయితే అసలు ట్వీస్ట్ అక్కడే ఉందట. సినిమాలో చిట్టిబాబు అన్నకుమార్ బాబుగా పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో అసలు విలన్ కుమార్ బాబేనని, ఆ విషయం చిట్టిబాబు కూడా చివరి దాకా తెలియదని... అదే సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చివరి దాకా అమాయకుడిగా ఉండే ఆది, క్లైమాక్స్ వచ్చే సరికి తన అసలు రంగు బయట పెడతాడని అనుకుంటున్నారు.
ప్రెసిడెంట్ జగపతిబాబుకి పోటీగా ఆది పినిశెట్టి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా పోస్టర్ల ద్వారా పాత్రలను పరిచయం చేసినప్పుడే రివిల్ చేశారు. అంటే అధికారం కోసం అమాయకుడిగా నటిస్తూ, ఎన్నికల్లో గెలిచాక తనలోని క్రూరత్వాన్ని చూపించే పాత్ర ఆది పినిశెట్టి పోషిస్తున్నాడని, అందుకే అతన్ని ఎంపిక చేశారని కథ అల్లేస్తున్నారు. ఇదే కథ అయితే ఇలాంటి కథతోనే ‘రంగం’ సినిమా వచ్చింది. మళ్లీ దాన్నే కొంచెం మార్చి, గ్రామీణ నేపథ్యంలో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు - రామలక్ష్మీ ప్రేమకథను కలిపి ‘రంగస్థలం’ తీశాడని అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఎన్ని నిజమో తెలియాలంటే మాత్రం శుక్రవారం మొదటి షో పడేదాకా ఎదురుచూడాల్సిందే.