Begin typing your search above and press return to search.
ఈ తప్పెవరిది క్రిష్
By: Tupaki Desk | 26 Jan 2019 1:11 PM GMTఅంతా అనుకున్నట్టే అయ్యింది. దర్శకుడు మారి ఆ బాధ్యతలు హీరొయిన్ చేతికి వచ్చి అసలు సినిమా ఎలా తయారయ్యిందో అన్న భయాలను నిజం చేస్తూ మణికర్ణిక నెగటివ్ రిజల్ట్ తెచ్చేసుకుంది. కర్ణిసేన పేరుతో రెండు మూడు వివాదాలు తలెత్తినా పద్మావత్ తరహాలో అవెందుకూ ఉపయోగపడలేదు. క్రిటిక్స్ కంటెంట్ మీద తీవ్ర విమర్శలు గుప్పించగా కంగనా పెర్ఫార్మన్స్ తప్ప సినిమాలో ఏముందని ప్రేక్షకులు సైతం పెదవి విరుస్తున్నారు. దేశవ్యాప్తంగా గ్రాస్ 10 కోట్లు కూడా దాటలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.
వీకెండ్ కాబట్టి ఈ మాత్రమైనా వచ్చిందని లేకపోతే సింగల్ డిజిట్ కు పడిపోతుందని ట్రేడ్ రిపోర్ట్. ఇదిలా ఉంచితే దర్శకుడిగా క్రిష్ పేరూ ఇందులో ఉంది కాబట్టి ఫలితంలో బాద్యత తీసుకోవాలి. పైగా నిన్న ట్విట్టర్ లో మణికర్ణిక మీద ప్రశంశలు కురుస్తున్నాయని ప్రత్యేకంగా పోస్ట్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు కంగనా చేతుల్లోకి వెళ్ళడం వల్ల ఇలా జరిగిందా లేక క్రిష్ కొనసాగించినా ఇలాగే వచ్చేదా లేక కథకులు కం పర్యవేక్షకులు విజయేంద్ర ప్రసాద్ ప్రమేయం వల్ల తేడా కొట్టిందా అనే ప్రశ్నకు సమాధానం ఈ ముగ్గురే చెప్పాలి.
ఝాన్సి లక్ష్మి బాయ్ కథలో బోలెడంత ఎమోషన్ తో పాటు అద్భుతమైన వార్ డ్రామా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు అవేవి కనిపించకపోవడంతో నిరాశ చెందిన మాట వాస్తవం. ముఖ్యంగా కథనం చప్పగా తేలిపోవడంతో ఎక్కడా డ్రామా లేక గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలు లేకపోయాయి. సో ఇప్పుడు ఇది సద్దుమణిగాక రియాక్షన్లు ఏమైనా ఉంటాయేమో చూడాలి. అన్నట్టు ఎన్టీఆర్ కథానాయకుడు దెబ్బకే దిగాలు పడుతున్న క్రిష్ కు కనీసం మణికర్ణిక అయినా ఊరట కలిగిస్తుందేమో అనుకుంటే ఇదీ అంతే సంగతులు చేసింది.