Begin typing your search above and press return to search.

బాలీవుడ్ టాప్ హీరోలందరూ అండర్ గ్రౌండ్ కి వెళ్లారెందుకు...?

By:  Tupaki Desk   |   16 Sep 2020 12:30 PM GMT
బాలీవుడ్ టాప్ హీరోలందరూ అండర్ గ్రౌండ్ కి వెళ్లారెందుకు...?
X
బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడు ఎక్కుడ చూసినా డ్రగ్స్ మాఫియా గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో మెల్లమెల్లగా అనేకమంది డ్రగ్ డీలర్స్ బయటకు వస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ పెడ్లర్స్ డీలర్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో రియా పలువురు బాలీవుడ్ వెల్లడించింది అంటూ నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఒకరిద్దరు స్టార్స్ మినహా బాలీవుడ్ లో డ్రగ్ ఇష్యూపై ఎవరూ ముందుకొచ్చి మాట్లాడటం లేదు.

రియా అరెస్ట్ తర్వాత బాలీవుడ్ లోని టాప్ హీరోలందరూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. డ్రగ్ కేసులో రియా అరెస్ట్ అయిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మీడియా ముందుకు వచ్చి ఈ ఇష్యూ పై మాట్లాడింది. ఇండస్ట్రీలో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకునేవారేనని చెప్తూ పలువురు హీరోల పై ఆరోణలు చేసింది. సుశాంత్ సూసైడ్ కేసు గురించి మొదటి నుంచి స్పందిస్తూ కంగనా.. చివరకు తన ఆఫీస్ ని కూల్చేసేదాకా తెచ్చుకుంది. ఇంత జరుగుతున్నా వందల కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకునే బాలీవుడ్ బాసులు మాత్రం డ్రగ్స్ ఇష్యూ పై కానీ.. కంగనా బంగ్లా కూల్చేయడం పై కానీ ఎందుకు స్పందించలేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

డ్రగ్స్ వ్యవహారం కారణంగా ఇప్పటికే బాలీవుడ్ కి చెడ్డ పేరు వచ్చింది.. అయినప్పటికి టాప్ హీరోలు ముందుకు వచ్చి డ్రగ్ ఇష్యూపై ఓ స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఎందుకు సైలెంట్ అయ్యారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అతి పెద్ద ఇండస్ట్రీగా పిలవబడుతున్న బాలీవుడ్ పై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్టార్ హీరోలు దీనిపై స్పందించి..'డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించమని.. డ్రగ్ మాఫియా లేకుండా చేయమని ఎందుకు చెప్పలేకపోతున్నారని అడుగుతున్నారు. డ్రగ్ ఇష్యూపై మాట్లాడితే వారి బండారం కూడా బయటకు వస్తుందనే భయంతోనే దీనిపై మాట్లాడటం లేదని.. అందుకే బాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో సైలెంట్ గా ఉంటున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా బాలీవుడ్ టాప్ హీరోలు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొనియున్న పరిస్థితులపై స్పందించాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.