Begin typing your search above and press return to search.
‘సైరా’ ప్రమోషన్ కు అమితాబ్ దూరం.. ఇందుకే..
By: Tupaki Desk | 20 Aug 2019 11:23 AM GMTచిరంజీవి హీరోగా నటించిన ‘సైరా’ నరసింహారెడ్డి మూవీ టీజర్ విడుదలతోపాటు ప్రమోషన్ ప్రక్రియ ఈ మధ్యాహ్నం ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిరుతోపాటు బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, దక్షిణాది నటులు సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, దర్శకుడు సురేందర్ రెడ్డి తదితరులు మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
అయితే సైరా సినిమాలో చిరంజీవికి గురువుగా చేసిన బిగ్ బి అమితాబ్ ముంబైలోనే ఉండి ఈ ప్రమోషన్, టీజర్ పార్ట్ ఫంక్షన్ కు ఎందుకు రాలేదన్న ప్రశ్న అందరినీ వెంటాడింది. అయితే ఆయన టీబీ వ్యాధితోనే బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న కారణంగానే చిరంజీవి ‘సైరా’ ప్రమోషన్ రాలేదని తెలిసింది.
టీబీ వ్యాధి చాలా ఆలస్యంగా అమితాబ్ కు బయటపడుతుందని ఇటీవలే తెలిపాడు. ఇటీవల అమితాబ్ వైద్య పరీక్షలు చేసుకోగా.. 8 ఏళ్ల క్రితమే ఇది అటాక్ అయ్యిందట.. ఇప్పటికీ వైద్య పరీక్షల్లో ఆలస్యంగా బయటపడిందని తెలిపాడు. గతంలో టీవీ, హైపటైటిస్ వ్యాధులు అమితాబ్ ను వేధించాయి. వాటికి చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత మందులు మానేసినా అవి పూర్తి స్థాయిలో తగ్గలేదట.. ప్రస్తుతం అమితాబ్ కాలేయం 75శాతం చెడిపోయిందని వైద్యులు తెలిపారట.. కేవలం 25 శాతం కాలేయంతోనే తాను బతుకుతున్నానని.. మందులతో కవర్ అవుతోందని అమితాబ్ తాజాగా తెలిపాడు.
76 ఏళ్ల అమితాబ్ పలు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా ఉన్నారు. చికిత్స తీసుకుంటూనే ‘సైరా’ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు సైరా ముంబై ప్రమోషన్ లో అనారోగ్య కారణాల వల్లే అమితాబ్ పాల్గొనలేదని సమాచారం.