Begin typing your search above and press return to search.

హీరో కంటే ఎక్కువా యాంకరమ్మా ?

By:  Tupaki Desk   |   8 Aug 2019 5:03 AM GMT
హీరో కంటే ఎక్కువా యాంకరమ్మా ?
X
చిన్నదో పెద్దదో చేతిలో ఉన్న కోట్లను బట్టి సినిమాను తీయొచ్చు. కానీ దాన్ని జనంలోకి తీసుకెళ్లి మొదటిరోజు థియేటర్ దాకా వచ్చేలా చేయాలంటే మాత్రం ప్రమోషన్ పాత్ర చాలా కీలకం. ఇది సరిగా చేయలేక మునిగిన మంచి సినిమాలు ఉన్నాయి కరెక్ట్ టైమింగ్ తో పబ్లిసిటీ ప్లాన్ చేయడం వల్ల ఒకటికి రెండు రూపాయల లాభం చూసిన తేడా మూవీసూ ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిస్టులందరూ ప్రమోషన్ లో పాల్గొని ప్రచారం ఉదృతం చేస్తే తప్ప పబ్లిక్ ఫలానా సినిమా వచ్చిందని పట్టించుకునే స్థితిలో లేరు.

కానీ యాంకర్ అనసూయ తీరు చూస్తుంటే మాత్రం అదేమి పట్టని తీరులో ఉంది. రేపు తనే కీలక పాత్ర పోషించిన కథనం రిలీజవుతోంది. అసలే నాగార్జున మన్మథుడు 2తో పోటీ. మరోవైపు కురుక్షేత్రం 3డి ఉంది. కాబట్టి హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అయిన కథనంకు ప్రచారం చాలా అవసరం. కానీ ఈ విషయంలో అనసూయ తీరు విమర్శలకు దారి తీస్తోంది ఇప్పటికే మూడు సార్లు ప్రెస్ మీట్ కు కాల్ చేసిన అనసూయ తీరా అందరు వస్తారు అనుకుంటున్నా టైంలో చివరి నిమిషంలో వాటిని రద్దు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

పెద్ద పెద్ద స్టార్లే మీడియా ఇంటరాక్షన్ అన్నప్పుడు మిస్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఆలస్యమైతే సారీ చెప్పిన హీరోలు ఉన్నారు. కానీ అనసూయ మాత్ర ఎవరి కోసం వస్తారు అనే తీరులో ఇలా పదే పదే మీట్ అని చెప్పి క్యాన్సిల్ చేయడం విమర్శలకు దారి తీస్తోంది.చిన్న సినిమాగా వస్తున్న కథనంకు అనసూయే సహకరించకపోతే రేపు జనం నుంచి వచ్చే రెస్పాన్స్ కు ఎవరు బాధ్యత వహిస్తారు. విడుదలకు దగ్గరగా ఉన్న రెండు మూడు రోజులు కూడా ఇలా వ్యవహరిస్తే తననే నమ్ముకుని సినిమా తీసిన నిర్మాత పరిస్థితి ఏంటి