Begin typing your search above and press return to search.
పోలీస్ డ్రెస్ చూసి చరణ్ ఫ్యాన్స్ ఎందుకంత హ్యాపీ?
By: Tupaki Desk | 27 March 2022 2:30 AM GMTట్రిపుల్ ఆర్ రిజల్ట్ విషయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు చాలా హ్యపీగా ఫీలవుతున్నారట. దీనికి ప్రధాన కారణం పోలీస్ డ్రెస్ లో కనిపించిన చరణ్ పై అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తుండటమేనని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సినిమాలో చరణ్ పెర్ఫర్మెన్స్ పై బాలీవుడ్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్న తీరు ఫ్యాన్స్ కు మరింత ఆనందాన్ని కలిగిస్తోందని, ఊహించని ఈ స్థాయి రెస్పాన్స్ బాలీవుడ్ వర్గాల నుంచి వస్తుండటంతో సంబరాలు చేసుకుంటున్నారట.
చరణ్ నటనని బాలీవుడ్ వర్గాలు పొగిడితే ఫ్యాన్స్ ఎందుకు సంబరపడుతున్నారా? అని ఆరాతీస్తే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటికి వచ్చింది. దాదాపు 9 ఏళ్ల క్రితం రామ్ చరణ్ బాలీవుడ్ లో కి తెరంగేట్రం చేస్తూ హిందీ మూవీ 'జంజీర్'లో నటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ నటించిన క్లాసిక్ మూవీ 'జంజీర్'కిది రీమేక్. ఇందులో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. 2013లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ లో దారుణ పరాభవాన్ని చవి చూసింది.
ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా, మేకర్స్, క్రిటిక్స్ చరణ్ పై దారుణంగా కామెంట్ లు చేశారు. అసలు నటనే రాదని, ఎక్స్ ప్రెషన్ కూడా సరిగా లేదని, సూపర్ స్టార్ క్లాసిక్ ని కిల్ చేశారని నానా రకాలుగా విమర్శించారు. అయితే సీన్ మారింది. ట్రిపుల్ ఆర్ హిందీ వెర్షన్ ని చూసిన బాలీవుడ్ వర్గాలు చరణ్ నటనకు మంత్రముగ్ధులవుతున్నారు. ఒకరంటే ఒకరు పోటీపడి మరీ రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రామరాజు పాత్రలో రామ్ చరణ్ అభినయం టెర్రిఫిక్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 'ధృవ' లో పోలీస్ ఆఫీసర్ గా నటించిన చరణ్ స్టైలిష్ కాప్ గా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఆ తరువాత చేసిన 'రంగస్థలం'తో సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేశాడు.
ఈ రెండు చిత్రాలకు మించి ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ నటనతో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా చాలా పరిణతి చెందిన నటనతో కనిపించడంతో బాలీవుడ్ వర్గాలు చరణ్ కు బ్రహ్మరథం పడుతూ జేజేలు కొడుతున్నారు.
ఈ మార్పుని గమనించిన చరణ్ ఫ్యాన్స్ ఈ ఆనందకర క్షణాలని ఆస్వాదిస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారట. గతంలో పోలీస్ క్యారెక్టర్ అనగానే 'జంజీర్'ని గుర్తు చేసుకుని భయపడిన ఫ్యాన్స్ 'ఆర్ ఆర్ ఆర్' ఫలితంతో ఇప్పడు హ్యాపీగా ఫీలవుతున్నారట.