Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్స్ టిల్లుని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   2 Dec 2022 6:33 AM GMT
స్టార్ హీరోయిన్స్ టిల్లుని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు?
X
ఇక సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిందంటే దానికి సీక్వెల్ గా రానున్న సినిమా కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపిస్తుంటారు. అంతే కాకుండా క్రేజీ స్టార్స్, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు, హీరోయిన్ లు కూడా అందులో న‌టించాల‌ని అవ‌కాశం కోసం ఎదురుచూస్తుంటారు. కానీ 'డీజే టిల్లు' సీక్వెల్ విష‌యంలో మాత్రం చాలా వ‌ర‌కు హీరోయిన్ లు నేనే న‌టించ‌నంటే నేను న‌టించ‌ను బాబోయ్ అంటూ పారిపోతున్నారు. ఇంత‌కీ టిల్లు' సీక్వెల్ వెన‌క ఏం జ‌రుగ‌తోంది? ఎందుకు హీరోయిన్ లు, డైరెక్ట‌ర్ మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి ప్లీజ్ అంటున్నారు?

ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండా ఫ‌స్ట్ పార్ట్ లో న‌టించిన‌ హీరోయిన్ ఎంతుకు త‌ప్పుకుంది?.. ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ కూడా నేను చేయ‌ను ప్లీజ్ అని మ‌రో ప్రాజెక్ట్ కు ఎందుకు వెళ్లిపోయాడు?.. సీక్వెల్ కోసం ఫైన‌ల్ చేసుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ షూటింగ్ ప్రారంభం అయ్యాక ఎందుకు ఈ మూవీ నుంచి త‌ప్పుకుంది?.. ఇంత‌కీ 'టీల్లు 2' తెర వెనుక ఏం జ‌రుగుతోంది అన్న‌ది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. సిద్దూ జొన్న‌ల గ‌డ్డ న‌టించిన మూవీ 'డీజే టిల్లు'. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైన ఈ మూవీ ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద‌ రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధించింది. అంతే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. త‌క్కువ బ‌డ్జెట్ తో ఎలాంటి అంచ‌నాలు లేకుండా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అనూహ్య విజ‌యాన్ని సాధించి 50 కోట్ల క్ల‌బ్ లో చేరింది.

ఇంత‌టి భారీ విజ‌యాన్ని సాధించిన ఈ మూవీకి సీక్వెల్ గా 'టిల్లు 2'ని రీసెంట్ గా మొద‌లు పెట్టారు. ముందు ద‌ర్శ‌కుడు ఔట్‌.. ఆ త‌రువాత హీరోయిన్ నేహాశెట్టి ఔట్‌.. దీంతో ద‌ర్శ‌కుడిగా మ‌ల్లిక్ రామ్ వ‌చ్చేశాడు.

ఆ త‌రువాత హీరోయిన్ గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని ఫైన‌ల్ చేసుకున్నారు. తాజాగా త‌ను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో 'ప్రేమ‌మ్' బ్యూటీ మ‌డోన్నా సెబాస్టియ‌న్ ని ఎంపిక చేసుకున్నారు. ముందు నేహాశెట్టి స్థానంలో రాశీఖన్నాని ఎంపిక చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు.

కానీ త‌రు ఆస‌క్తిని చూపించ‌లేదు. ఆ త‌రువాత టీమ్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని ఎంపిక చేసింది. ఇప్ప‌డు త‌ను కూడా త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో మ‌డోన్నా సెబాస్టియ‌న్ ని ఎంపిక చేసుకున్నారు. ఇలా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే బ్యాక్ టు బ్యాక్ హీరోయిన్ లు ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోతుండ‌టంతో ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 'డీజే టిల్లు'లో హీరోయిన్ కు అంత ప్రాధాన్య‌త లేదు. నిజం చెప్పాలంటే 'Rx100' త‌ర‌హాలో హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ విల‌న్ అని చెప్పొచ్చు. ఆ కార‌ణంగానే ప్రాధాన్య‌త‌లేని పాత్ర‌లో న‌టించ‌డం ఇష్టం లేక‌, సిద్దూతో రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించ‌డం ఇష్టం లేక‌నే హీరోయిన్ లు వెళ్లిపోతున్నార‌ని, అలాంటి పాత్ర‌లో మ‌డోన్నా సెబాస్టియ‌న్ కూడా ఈ మూవీతో పెద్ద‌గా ఫేన్ ని ద‌క్కించుకోవ‌డం క‌ష్ట‌మేన‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.