Begin typing your search above and press return to search.

నా మీసం.. నా ఇష్టం..

By:  Tupaki Desk   |   16 Oct 2017 1:10 PM GMT
నా మీసం.. నా ఇష్టం..
X
రాజుగారి గది 2 సినిమాలో మెంటలిస్ట్ గా కనిపించిన నాగార్జున అందరిని చాలా ఆకట్టుకున్నారు. సినిమాపై మిక్సుడ్ టాక్ వస్తున్నా కూడా అందులో నాగ్ చేసిన పాత్ర హైలెట్ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక సినిమాకు ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో నిర్వహించిన నాగ్ ఎక్కడైకి వెళ్లినా ఒక ప్రశ్నతో సతమతమవుతున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ప్రెస్ మీట్ లో అలాగే సినిమా తర్వాత సక్సెస్ మీట్ లో ఎక్కువగా అందరు మీసం ఎందుకు తీశారని అడుగుతున్నారు.

అయితే ఈ విషయంపై నాగార్జున ఒక కౌంటర్ వేశారు. ఆయన చెప్పిన తీరును చూస్తే మొదట క్లారిటీ ఇస్తారని అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా 'నా మీసం నా ఇష్టం' అనడంతో అందరు నవ్వేశారు. ఎక్కడికి వెళ్లినా కూడా ఈ ప్రశ్ననే ఎదురవుతుందని నాగార్జున చెప్పారు. అంతే కాకుండా మీసం ఉంచుకున్నా గొడవే.. మీసం తీసేసినా గొడవే.. నా లైఫ్ నాకు ఇష్టం ఉన్నట్టు ఉండనివ్వండి... మీసం ఎందుకు తీశారు అనేది ఒక పెద్ద న్యూస్ అయిపొయిందని హాస్యాస్పదంగా చెప్పారు. ఫైనల్ గా నా మీసం నా ఇష్టం.. అని పెద్ద కౌంటర్ వేశారు నాగ్.

ఆయన నెక్స్ట్ సినిమాలో స్పెషల్ గెటప్ కోసం ఆ విధంగా కనిపిస్తున్నారని ఇంతకుముందు వార్తలు వచ్చాయి కానీ నాగ్ మాత్రం మీసం గురించి ఎలాంటి కారణం లేదని కేవలం తన ఇష్టప్రకారమే మీసాన్ని తీసాను అనే విధంగా మాట్లాడుతున్నారు. రీసెంట్ గా ఓ లేడీ యాంకర్ కూడా మీసం ఎందుకు తీశారంటే నాగ్ నవ్వుతూనే స్వీట్ కౌంటర్ వేశారు.