Begin typing your search above and press return to search.

సినిమా డిజాస్ట‌ర్‌.. ద‌ర్శ‌కుడే టార్గెట్ ఎందుకు?

By:  Tupaki Desk   |   1 Dec 2022 2:30 AM GMT
సినిమా డిజాస్ట‌ర్‌.. ద‌ర్శ‌కుడే టార్గెట్ ఎందుకు?
X
ఒక సినిమా ప‌ట్టాలెక్కాలంటే స్టోరీ రైట‌ర్ నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఆ క‌థ ముందు ద‌ర్శ‌కుడి దాకా వెళితే.. అక్క‌డ మార్పులు చేర్పులు స‌హ‌జ‌మే.. అక్క‌డి నుంచి క‌థ హీరో రెడీగా వుంటే హీరో.. లేదంటే ప్రొడ్యూస‌ర్ వుంటే ప్రొడ్యూస‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌డం తెలిసిందే. త‌ను మార్పులు చెప్ప‌కుండా ఓకే అని హీరోకు చెప్ప‌మని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తే ద‌ర్శ‌కుడు, రైట‌ర్ వెళ్లి క‌థ వినిపిస్తారు. ఒక వేళ ద‌ర్శ‌కుడే క‌థ‌కుడైతే తానే నిర్మాత చెప్పిన హీరోకు స్టోరీ న‌రేట్ చేస్తాడు.

హీరోకు న‌చ్చిందా ఓకే లేదంటే మ‌ళ్లీ మార్పులు అనివార్యం. హీరోనే మార్పులు చెప్ప‌డం..ఆ మార్పులని ద‌ర్శ‌కుడు, రైట‌ర్ ఇంప్లిమెంట్ చేయ‌డం అనేది గ‌త కొన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో జ‌రుగుతూనే వుంది. హీరో చెప్పిన మార్పులు, సీన్ లు, డైలాగ్ లు అనుకున్న విధంగా ద‌ర్శ‌కుడు మార్చ‌లేదంటే.. ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌దన్న‌ది ఇండ‌స్ట్రీలో ప్ర‌తీ ఒక్క‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇలా అన్ని మార్పులు ప‌క్కాగా కుదిరి హీరో ఫైన‌ల్ అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాకే సినిమాలని స్టార్ట్ చేస్తుంటారు.

అయితే ఇన్నీ జ‌రిగిన త‌రువాత కూడా సెట్ లో కొన్ని సీన్ లు, డైలాగ్ లు న‌చ్చ‌క పోవ‌డంతో హీరోలు స్పాట్ లో మార్పులు చేస్తుంటారు. ఇంత జ‌రిగాక కూడా డిజాస్ట‌ర్ లు ఎదురైతే మాత్రం హీరోలు, నిర్మాత‌లు ఈ మ‌ధ్య ద‌ర్శ‌కుల‌ని టార్గెట్ కేయ‌డం, వారినే కార్న‌ర్ చేయ‌డం జ‌రుగుతోంది. అన్ని మార్పులు చేసి తెర‌పై ఆవిష్కిస్తే ఆ సినిమా అనుకోకుండా ఫ్లాప్ అయితే అన్నీ తెలిసిన‌ హీరోలు సైతం ఆ నెపాన్ని ద‌ర్శ‌కుడిపైనే నెట్టేస్తున్నారు. ఈ ప‌రాజ‌యంలో త‌మ ప్ర‌మేయం లేద‌ని చేతులు దులిపేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు చెప్పిందే చేశాం త‌ప్ప మాకేమీ తెలియ‌ద‌ని, ఇలా అవుతుంద‌ని తాము అనుకోలేద‌ని, చాలా వ‌ర‌కు ద‌ర్శ‌కులు సెట్ లోనే సీన్ లు, మాట‌లు రాస్తున్నార‌ని మీడియా వేదిక‌గా కామెంట్ లు చేస్తూ చాలా మంది ద‌ర్శ‌కుల‌ని కార్న‌ర్ చేస్తున్నారు. `ఆచార్య‌` సినిమా విష‌యంలో ఇదే జ‌రిగింది. ఈ మూవీ డిజాస్ట‌ర్ కావ‌డంతో చిరు ప‌రోక్షంగా ద‌ర్శ‌కుడిపై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. త‌ను చెప్పిందే చేశాం కానీ ఇలా అయింద‌ని, సెట్ లో కొంత మంది ద‌ర్శ‌కుడు అప్ప‌టిక‌ప్పుడు సీన్ లు రాస్తున్నార‌ని, ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని కొర‌టాల శివ‌పై ప‌రోక్షంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే.

అలా అంటే `లైగ‌ర్‌`తో దారుణ ఫ్లాప్ ని ఎదుర్కొన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఏమ‌నాలి? .. ఒళ్లు హూనం చేసుకుని చేతులు పుళ్లుప‌డిపోయినా స‌రే ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ పై ఎలాంటి కామెంట్ లు చేయ‌లేదు. త‌ను చేసిన క‌ష్టం వృధాఅయిందే.. మేడున్న‌రేళ్లు శ్ర‌మించి తాను క‌న్న కల క‌ల్ల‌ల‌యిందే అని మీడియాకూ ఎక్క‌లేదు. కార‌ణం త‌న‌కు తెలుసు కాబ‌ట్టి. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో గ్ర‌హించాడు కాబ‌ట్టి.

`మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం` ఫ్లాప్ అయితే నితిన్ కూడా ద‌ర్శ‌కుడిని నిందించ‌లేదు. త‌ను న‌మ్మాడు కాబ‌ట్టే చేశాడు కాబ‌ట్టి ఫ‌లితంపై పెద‌వి విప్ప‌లేదు. అంటే ఇక్క‌డ ఓ సినిమా సెట్స్ పైకి వెళుతోందంటే ద‌ర్శ‌కుడు ఒక్క‌డే క‌థ‌లో వేలు పెట్ట‌డం లేదు.. హీరో, నిర్మాత వేలు పెడుతున్నారు.. ద‌ర్శ‌కుడు అనుకున్న‌ట్టుగా కాకుండా నిర్మాత‌, హీరోలు అనుకున్న‌ట్టుగా వెళ్ల‌డం వ‌ల్లే చాలా వ‌ర‌కు ఫ్లాపులు వ‌స్తున్నాయి అని ఇండ‌స్ట్రీలో కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.