Begin typing your search above and press return to search.

సెలబ్రెటీలకు ఆ సెన్స్ ఎందుకుండదు?

By:  Tupaki Desk   |   25 Jan 2019 1:30 AM GMT
సెలబ్రెటీలకు ఆ సెన్స్ ఎందుకుండదు?
X
సాంకేతికత పెరిగేకొద్దీ లాభాలతో పాటు నష్టాలూ ఉంటాయి. నాణేనికి రెండో ముఖం ఉన్నట్లుగా.. ప్రతి విషయంలోనూ రెండో కోణం ఉంటుంది. టెక్నాలజీ వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నా.. దాని వల్ల జరిగే అనర్థాలూ చూస్తూ ఉన్నాం. ఈ స్మార్ట్ యుగంలో జనాలకు ప్రైవసీ అనేదే లేకుండా పోతోంది. ఎక్కడ కెమెరా ఉంటుందో తెలియదు. ఏ సమాచారం బయటికి వస్తుందో తెలియదు. సెన్సిటివ్ విషయాల్లో అప్రమత్తత లేకుంటే జీవితాంతం చింతిచాల్సిన పరిస్థితి తలెత్తుతుతంది. ఐతే సాంకేతికత గురించి అవగాహన లేని వాళ్లు తప్పులు చేసి ఇంటర్నెట్లో బలి పశువులు కావడం తరచుగా చూస్తుంటాం. పడక గదుల్లో తీసే ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చి ఎన్నో జీవితాలు బలైపోతుంటాయి. ఐతే ఈ పరిణామాల గురించి అవగాహన ఉన్న సెలబ్రెటీలు సైతం తప్పులో కాలేస్తుండటమే ఆశ్చర్యకరమైన విషయం.

ఆ మధ్య కమల్ హాసన్ తనయురాలు అక్షర హాసన్.. ఇన్నర్ వేర్‌ లో తీసుకున్న ఫొటోలు బయటికి రావడం సంచలనం రేపింది. తాజాగా హన్సిక మొత్వాని ఫొటోలు కూడా ఇలాగే బయటికి వచ్చాయి. గతంలో హన్సికదంటూ ఒక న్యూడ్ వీడియో కూడా వెలుగు చూసింది. అందులో ఉన్నది హన్సికో కాదో ధ్రువీకరించలేం. ఆ వీడియో ఎవరో రహస్యంగా తీసింది కాబట్టి ఓకే అనుకుందాం. కానీ ఇప్పుడు బయటికి వచ్చింది హన్సిక స్వయంగా తీసుకున్న సెల్ఫీలు. ఒంటి మీద లో దుస్తులతో అలాంటి ఫొటోలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ప్రశ్న.

మొబైల్ ఫోన్లోని సమాచారం సేఫ్ అనుకోవడానికి ఎంత మాత్రం లేదు. పైగా ఫిలిం సెలబ్రెటీల విషయంలో ఏ చిన్న సమచారం దొరుకుతుందా అని జనాలు కాచుకుని ఉంటారు. హ్యాకర్లు వాళ్ల మీద ఓ కన్నేసి ఉంచుతారు. అలాంటపుడు ఇలాంటి ఫొటోలు, వీడియోలు తీసుకోవడం ప్రమాదమన్న సెన్స్ సినిమా జనాలకు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఫోన్ హ్యాక్ అయిందని.. ట్విట్టర్ హ్యాక్ అయిందని ఇలా ఎన్ని మాటలు చెప్పుకున్నా.. అసలు ఇలాంటి ఫొటోలు దిగాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ప్రశ్న. ఈ తరహా ఫొటోలు, వీడియోలు ఫోన్లో ఉండగా.. హ్యాకింగ్ సంగతలా ఉంచితే, పొరబాటున అది ఎక్కడైనా పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి? మరి హన్సిక వ్యవహారం చూశాకైనా సెలబ్రెటీలు ఇలాంటి విషయాల్లో అప్రమత్తం అవుతారేమో చూద్దాం.