Begin typing your search above and press return to search.

ధావన్ పెళ్లికి బచ్చన్ కుటుంబాన్ని ఎందుకు ఆహ్వానించలేదు?

By:  Tupaki Desk   |   24 Jan 2021 5:30 PM GMT
ధావన్ పెళ్లికి బచ్చన్ కుటుంబాన్ని ఎందుకు ఆహ్వానించలేదు?
X
యువ‌హీరో వరుణ్ ధావన్ ఈ రోజు తన చిరకాల ప్రేయసి నటాషా దలాల్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిన‌దే. ఈ ఆదివారం సాయంత్రం మహారాష్ట్రలోని అలీబాగ్ ప్యాలెస్ వేదిక‌గా వివాహం వైభ‌వంగా జ‌రుగుతోంది.

ఈ పెళ్లికి ఖాన్ ల త్ర‌యం స‌హా చాలా మంది హాజ‌ర‌వుతున్నారు. కానీ సీనియర్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులను ఎవరినీ ఈ వివాహానికి ఆహ్వానించలేదు. ఇది తెలిసి వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ సన్నిహితుడు .. సీనియర్ హీరో గోవిందా కూడా ఈ సాయంత్రం వివాహానికి హాజరయ్యే ప్లాన్ విర‌మించార‌ట‌.

వరుణ్ ధావన్ వివాహానికి బచ్చన్లను ఆహ్వానించకపోవటానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే కోవిడ్ నియ‌మ‌నిబంధ‌న‌ల వ‌ల్ల త‌క్కువ‌మంది అతిథుల్ని మాత్ర‌మే ఆహ్వానించారు. అయినంత మాత్రాన బిగ్ బీనే వ‌దిలేస్తారా? అన్న‌ది అభిమానుల కామెంట్. మ‌రి దీనికి స‌హేతుక కార‌ణం ఏమై ఉంటుంది?