Begin typing your search above and press return to search.
దిల్ రాజు ఆ పదింటిని ఎందుకు పక్కన పెట్టేశారు?
By: Tupaki Desk | 19 July 2022 2:30 PM GMTకరోనా కారణంగా ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. బయటికి వెళ్లే వీలు లేకపోవడంతో చాలా వరకు ఇంటి పట్టునే వున్నారు. వినోదం కోసం ఓటీటీ వేదికల్లో ప్రపంచ సినిమాని చూశారు. దీంతో సాధారణ కథలని ఆదరించడం కష్టమనే పరిస్థితులు నెలకొన్నాయి. కంటెంట్ వున్న చిత్రాలని మాత్రమే ఆదరించడం, భారీ స్పాన్ వున్న సినిమాల కోసమే థియేటర్లకు రావడం మొదలు పెట్టారు. దీంతో ఇటీవల విడుదలైన చాలా వరకు సినిమాలు థియేటర్లలో రెండు వారాలకు మించి నిలబడలేకపోయాయి.
ఈ విషయాన్ని దిల్ రాజు గ్రహించారట. కరోనాకు ముందు కరోనా తరువాత దిల్ రాజు వరుసగా భారీ ప్రాజెక్ట్ లని ప్రకటించారు. ఇప్పటి వరకు అందులో కొన్ని సినిమాలు పూర్తయి రిలీజ్ కూడా అయ్యాయి. కొన్ని రిలీజ్ కు రెడీ గా వున్నాయి. కొన్ని భారీ ప్రాజెక్ట్ లె ప్రస్తుతంచిత్రీకరణ దశలో వున్నాయి.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ ల కాంబినేషన్ లో ఓ భారీ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో `వారసుడు` పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ భారీ మూవీని నిర్మిస్తున్నారు.
ఇదిలా వుంటే ఇటీవల `థాంక్యూ` మూవీ రిలీజ్ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన దిల్ రాజు ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కరోనా సమయంలో స్టార్ డైరెక్టర్లంతా ఏవేవో కథలు వినిపించి హీరోల డేట్స్ లాక్ చేసుకున్నారని, అయితే అవి ఇప్పటికి ఔట్ డేటెడ్ అయ్యాయని బాంబ్ పేల్చారు. అంతే కాకుండా ప్రేక్షకులు కరోనా టైమ్ లో వరల్డ్ సినిమాపై అవగాహన పెంచుకున్నారని, వాళ్లని రెగ్యులర్ కథలతో సంతృప్తి పరచడం కష్టమన్నారు.
అంతే కాకుండా కరోనా సమయంలో మొత్తం పది కథలు విన్నారట. వాటిని ఫైనల్ చేశారట. సినిమాలు చేయాలనుకున్నారట. అయితే కరోనా తరువాత మారిన ప్రేక్షకుల మైండ్ సెట్ ని దృష్టిలో పెట్టుకుని ఆ పది కథలని పక్కన పెట్టారట.
అంతే కాకుండా సెట్స్ పైకి వెళ్లాల్సిన రెంగడు సినిమాలని కూడా అర్థాంతరంగా ఆపేశారట. ఇప్పడిది చర్చనీయాంశంగా మారింది. దిల్ రాజు త్వరలో స్మాల్ మూవీస్ ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అంతే కాకుండా తమ సంస్థ ద్వారా వెబ్ సిరీస్ లని కూడా బ్యాక్ టు బ్యాక్ నిర్మించబోతున్నారట.