Begin typing your search above and press return to search.

జాన్వీ గతంలో తెలుగు ఆఫర్స్ ని ఎందుకు రిజెక్ట్ చేసింది..?

By:  Tupaki Desk   |   4 Nov 2022 2:30 AM GMT
జాన్వీ గతంలో తెలుగు ఆఫర్స్ ని ఎందుకు రిజెక్ట్ చేసింది..?
X
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్.. తల్లి బాటలో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడటానికి కష్టపడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోన్న జాన్వీని తెలుగు చిత్ర పరిశ్రమకు తీసుకురాడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లి తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న శ్రీదేవి కూతురు కావడంతో.. ఇక్కడి జనాలు జాన్వీని బాగా ఓన్ చేసుకున్నారు. తెలుగు సినిమాల్లోనూ హీరోయిన్ గా చేస్తే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు.

నిజానికి జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. మన దర్శక నిర్మాతలు అమ్మడిని తెలుగు చిత్రాల్లో నటింపజేయాలని ట్రై చేసారు కానీ.. అమ్మడు ఆ ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఇదే విషయం మీద తాజాగా మీడియా మిత్రులు జాన్వీ కపూర్ ని ప్రశ్నించారు.

'మిలీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన తండ్రి బోణీ కపూర్ తో కలిసి హైదరాబాద్ కు విచ్చేసిన జాన్వీ.. బుధవారం తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలుగులో చాలా ఆఫర్లు వచ్చినా ఎందుకు తిరస్కరించారు? ఏదైనా పెద్ద ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారా? అని జాన్వీని ప్రశ్నించారు.

అయితే దీనికి జాన్వీ బదులిచ్చేలోపు పక్కనే ఉన్న బోనీ కపూర్ మైక్ అందుకొని.. ఆ విషయాలు చర్చించేందుకు ఇది సరైన వేదిక కాదని సమాధాన్ని దాటవేశారు. ఆఫర్స్ మరియు వాటి గురించిన వివరాలు ప్రొఫెషన్ లో భాగమైనందున చర్చించలేమని పేర్కొన్నారు బోనీ.

ఈ క్రమంలో జాన్వీ తన తండ్రి చెప్పినదాన్ని కవర్ చేస్తూ.. తాను ఒక తెలుగు చిత్రంలో పని చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నానని.. త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని చెప్పింది. సౌత్ ఇండస్ట్రీ తన తల్లిదండ్రులపై చాలా ప్రేమను చూపించిందని.. అలాంటి చిత్ర పరిశ్రమలో పనిచేయాలనేది తన కోరిక అని జాన్వీ పేర్కొంది.

ఇక ఎన్టీఆర్ తో నటించడం గురించి ప్రస్తావించగా, "ఇప్పటికే చాలా సార్లు చెప్పా. ఇప్పుడు మళ్ళీ చెబుతా. ఎన్టీఆర్ సార్‌ తో పనిచేయాలని ఎవరికి ఇష్టం ఉండదు? అలాంటి లెజెండ్.. అలాంటి ఐకాన్ యాక్టర్ తో కలిసి పనిచేయడం నా డ్రీమ్" అని జాన్వీ వివరించారు.

బోనీ కపూర్ మాట్లాడుతూ 'నా 16 చిత్రాలను హైదరాబాద్లోనే చిత్రీకరించాం. ఇక్కడి వారితో నాకు మంచి అనుబంధం ఉంది. నా భార్య శ్రీదేవిపై తెలుగు ప్రేక్షకులు ఎంతో అభిమానం కురిపించారు. ఇప్పుడు జాన్వీ ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు.

ఇకపోతే గతంలో జాన్వీ కపూర్ కి తెలుగు నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

అయితే జాన్వీ ఇప్పటికే ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబోలో తెరకెక్కనున్న NTR30 మూవీలో హీరోయిన్ గా సైన్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇక జాన్వీ ప్రధాన పాత్రలో మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'మిలీ' సినిమా నవంబర్ 4న రిలీజ్ కాబోతోంది. జాన్వీ తన తండ్రి బోనీ కపూర్ నిర్మాణంలో చేసిన ఫస్ట్ మూవీ ఇది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.