Begin typing your search above and press return to search.
ఆ పాత్రకు ఆయనే కరెక్ట్ అంటున్న జక్కన్న
By: Tupaki Desk | 7 April 2020 11:50 AM GMTటాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ - ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన లోగోను మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. అంతేకాకుండా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ వీడియో పలు భాషలలో విడుదలై ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ - చరణ్ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి అజయ్ దేవగన్ ని తీసుకోవడానికి గల కారణం గురించి రాజమౌళి తాజాగా ఓ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఈ సినిమా కంటే ముందు ఈగ సినిమాను హిందీలో విడుదల చేయాలని జక్కన్న అనుకున్నప్పుడు అజయ్ - కాజోల్ ను కలిశారట. హిందీ వెర్షన్ కు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఇద్దరు వెంటనే ఒప్పుకొన్నారట. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ కోసం కలిసి పని చేస్తున్నట్లు తెలిపాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర చాలా గొప్పగా ఉంటుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే ఈ పాత్ర కోసం ఉండాల్సిన లక్షణాలు - నాకు ఉన్న అవసరాలు కొంత మందికి చెప్పి - సలహా అడిగిన క్రమంలో పదిలో తొమ్మిది మంది అజయ్ దేవగణ్ పేరు చెప్పారు. పాత్ర గురించి చెప్పగానే ఒప్పుకున్నందుకు చాలా అనందంగా ఉందన్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.