Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్ అంత పని ఎందుకు చేశారు?
By: Tupaki Desk | 13 April 2021 12:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే మామి (ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్) కు రాజీనామా చేశారు. విరమణ సమయం వరకు దీపిక మామి ఛైర్మన్ పర్సన్ గా ఉన్నారు. ఇలా అర్థాంతరంగా రాజీనామాకు కారణమేమిటి? అంటే దానికి కూడా దీపిక సందేహ నివృత్తి చేసారు.
తన రాజీనామా సంగతిని ఇన్ స్టాలో వెల్లడించిన దీపిక మామిలో పదవి చేపట్టడం తనకు ఎంతో గౌరవమని అది గొప్ప అనుభవమని అన్నారు. ``ఒక ఆర్టిస్టుగా ప్రపంచం నలుమూలల నుండి సినిమా ప్రతిభను నా రెండవ నివాసమైన ముంబైకి తీసుకురావడం ఎగ్జయిట్ చేసేదే. కానీ నేను ఇప్పుడున్న బిజీలో మామి పనులపై దృష్టి సారించలేను. మామి సాధ్యమైనంత ఉత్తమమైన వారి చేతిలో ఉందని నమ్ముతున్నాను. అకాడమీతో నా బంధం జీవితకాలం కొనసాగుతుంది`` అని దీపిక పేర్కొన్నారు. అమీర్ భార్య కిరణ్ రావు నుండి మామి ఛైర్పర్సన్ పాత్రను దీపిక చేపట్టారు. 2019 నుంచి పదవిలో ఉన్నారు. కానీ ఇప్పుడు దాని నుంచి గౌరవంగా తప్పుకున్నారు.
దీపిక కెరీర్ మ్యాటర్ కి వస్తే తను ఓవైపు నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ కొనసాగుతు్నారు. భర్త రణవీర్ నటించిన 83 చిత్రానికి నిర్మాతగా కొనసాగారు. అలాగే కీలక పాత్రను పోషించారు. తదుపరి షారూక్ సరసన పఠాన్ లో దీపిక నాయిక. ఆ తర్వాతా ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ పాన్ ఇండియా చిత్రం లోనూ నటిస్తోంది. హాలీవుడ్ చిత్రం `ది ఇంటర్న్` హిందీ రీమేక్ కి సంతకం చేసారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో దీపిక స్క్రీన్ స్పేస్ పంచుకోనుంది. సిద్ధార్థ్ ఆనంద్ తదుపరి చిత్రం `ఫైటర్` లో హృతిక్ రోషన్ సరసన నటించనుంది. ఇంత పెద్ద షెడ్యూల్ తో ఛైర్మన్ బాధ్యతల్ని సరిగా నెరవేర్చలేననే రాజీనామా చేశారు.