Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోయిన్ 'వకీల్ సాబ్'ను ఎందుకు పక్కనపెట్టింది..??

By:  Tupaki Desk   |   8 April 2021 9:40 AM GMT
ఆ స్టార్ హీరోయిన్ వకీల్ సాబ్ను ఎందుకు పక్కనపెట్టింది..??
X
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ హీరో సినిమా అయినా ప్రమోషన్స్ అనేవి ఖచ్చితం. ఎందుకంటే సినిమాలను ఎంత కరెక్ట్ గా ప్రచారం చేస్తే అంత ఎక్కువమందికి సినిమా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జనాలకు కనెక్ట్ అయితే గనక సినిమాకు వారే బ్రహ్మరథం పడతారు. కానీ సినిమా ఎంతటి బడ్జెట్ తో తీసినా.. ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ పక్కా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సినిమా విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఏప్రిల్ 9న వకీల్ విడుదల కాబోతుండటంతో సినిమా పై అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ ప్రమోషన్లకు దూరంగా ఉండటంతో సినిమాను హీరోయిన్స్ అంజలి, అనన్య మాత్రమే ప్రచారం చేస్తున్నారు.

ఓవైపు నివేతా థామస్ కరోనా బారినపడి హోమ్ క్వారంటైన్ లో ఉంది. కానీ వీళ్లంతా కనిపిస్తున్నారు కానీ ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ పాత్రలో నటించిన శ్రుతిహాసన్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అలాగే ఇంతవరకు కనిపించలేదు. పవన్‌ కళ్యాణ్ సరసన శృతిహాసన్ నటించడం ఇది మూడోసారి. ప్రేక్షకులు కుడా ఈ గబ్బర్ సింగ్ జంటను ప్రేమిస్తారు. కానీ శృతి పవర్ స్టార్ సినిమా ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. శృతి నుండి కూడా తనవంతు కృషి చేసి ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేది. కానీ శృతి ఎందుకు రాలేదో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వకీల్ సాబ్ పై ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మూడేళ్ల తరువాత పవన్ నుండి వస్తున్న మొదటి మూవీ ఇది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి చూడాలి థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో!