Begin typing your search above and press return to search.

ఏపీలో టిక్కెట్ ధ‌ర‌ల‌పై హీరో సిద్ధార్థ్ ఫైరింగ్

By:  Tupaki Desk   |   2 Dec 2021 4:30 PM GMT
ఏపీలో టిక్కెట్ ధ‌ర‌ల‌పై హీరో సిద్ధార్థ్ ఫైరింగ్
X
ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త పాల‌సీతో సినీప‌రిశ్ర‌మ ఉక్కిరిబిక్క‌వుతున్న సంగ‌తి తెలిసిందే. టిక్కెట్ ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించ‌డం... అద‌న‌పు షోలు ర‌ద్దు చేయ‌డం..ఏ హీరో సినిమాకైనా ఒకే టిక్కెట్ ధ‌ర‌ను నిర్ణయించ‌డం.. ఆన్ లైన్ టిక్కెటింగ్ సిస్ట‌మ్ వ‌గైరా వ‌గైరా మార్పుల‌తో అంతా గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి..సురేష్ బాబు...అల్లు అర‌వింద్..దిల్ రాజులాంటి వాళ్లు ఏపీ స‌ర్కార్ ని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసారు.

ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని పెద్ద‌లు పున ప‌రిశీలించాల‌ని కోరారు. ఇంకా త్రివిక్ర‌మ్ నిత్యావ‌స‌ర సరుకుల ధ‌ర‌ల్ని...సినిమా టిక్కెట్ ధ‌ర‌ల్ని పోల్చుతు సెటైరికల్ గా స్పందించారు. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ఆన్ లైన్ టిక్కెట్ పెట్టి...ధ‌ర‌లు పెంచాల‌ని అందువల్ల ప్ర‌భుత్వానికే ఆదాయం వ‌స్తుంద‌ని సూచించారు.

తాజాగా ఈ సీన్ లోకి న‌టుడు సిద్ధార్డ్ కూడా వ‌చ్చారు. ఓ రెస్టారెంట్ కి ప్లేట్ ఇడ్లీ..కాఫీ ఎంత రేట్ ఉండాలో మీరు చెప్ప‌రు. కానీ సినిమా ప‌రిశ్రమ అంటే ఎందుకు అంత శ్ర‌ద్ద‌. వాళ్ల పెట్టుబ‌డి వాళ్లు రివక‌వ‌రీ చేసుకుంటారు. కొత్త‌గా వ‌చ్చిన జీవో ఎంఆర్పీటీ వ‌యోలెన్స్ కింద‌కి వ‌స్తుంది. ద‌య‌చేసి సినిమాని...సినిమా హాళ్ల‌ను బ్ర‌త‌క నివ్వండి..థియేట‌ర్ రెంట్..ఎంత పెట్టుబ‌డి పెడుతున్నారు? ఏరియాని బ‌ట్టి ద‌ర నిర్ధారించాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి సూచించారు.

ఇంకా ప‌రిశ్ర‌మ నుంచి పెద్ద‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నా..విన‌తి ప‌త్రాలు అందిస్తున్నా టికెట్ రేటు విష‌యంలో ఫ‌లించ‌డం లేదు. తగ్గింపు ధ‌ర‌ల‌తో సినిమా టికెట్ ధ‌ర క‌నిష్టంగా ఐదురూపాయ‌ల‌కు వ‌చ్చింది. గ్రామ‌పంచాయ‌తీ థియేట‌ర్లో 5 రూపాయ‌లు క‌నిష్టం కాగా.. మ‌ల్టీప్లెక్స్ ల్లో గ‌రిష్టంగా 250 రూపాయ‌లుగా ఉంది.