Begin typing your search above and press return to search.

మెగాస్టార్ టైటిల్స్ ని ఎందుకు టచ్ చేయరో

By:  Tupaki Desk   |   12 March 2019 7:00 AM IST
మెగాస్టార్ టైటిల్స్ ని ఎందుకు టచ్ చేయరో
X
నాని గ్యాంగ్ లీడర్ టైటిల్ రచ్చ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇది తాము గతంలోనే రిజిస్టర్ చేసుకున్నామని మెగా హీరోలకు తప్ప ఇంకెవరికి ఇచ్చే సమస్యే లేదని లేదంటే తానే హీరోగా ఇది తీస్తానని ఓ డెబ్యూ డైరెక్టర్ ప్రకటించడం ఇప్పటికే వేడి రాజేసింది. మైత్రి సంస్థ ఇంకా దీని గురించి స్పందించలేదు. సోషల్ మీడియా రచ్చ గురించి బాగా అనుభవం ఉన్న నాని నాకెందుకు లెమ్మని సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పటికి చల్లారినట్టు అనిపిస్తున్నా ఫైనల్ గా ఇది ఎక్కడ ముగుస్తుందో అర్థం కావడం లేదు.

మరోవైపు కార్తీ హీరోగా ఇటీవలే ప్రారంభమైన సినిమాకు ఖైదీ టైటిల్ డిసైడ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీని మీద మెగా ఫాన్స్ రియాక్ట్ అవ్వలేదు. తెలుగు వెర్షన్ అధికారికంగా ప్రకటించాక స్పందిస్తారేమో చూడాలి. నిజానికి ఇతర హీరోల కల్ట్ క్లాసిక్స్ టైటిల్స్ ని వాడుకోవడం కొత్తేమి కాదు. చాలా మాములు విషయం. గీతాంజలి-శంకరాభరణం-మల్లీశ్వరి-మిస్సమ్మ- దేవదాసు- మాయాబజార్- మజ్ను- అడవి రాముడు-వేటగాడు ఇలా అన్ని రెండు మూడు సార్లు వాడుకున్నవే. ఇందులో కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫట్ మన్నాయి. అది వేరే సంగతి.

కానీ మెగాస్టార్ టైటిల్స్ మాత్రం చాలా అరుదుగా వాడుతుంటారు దర్శకులు. ఒక్క నరేష్ మాత్రమే యముడికి మొగుడు తీసుకున్నాడు. ఇప్పుడీ గ్యాంగ్ లీడర్ వంతు వచ్చింది. కానీ ఓసారి కూడా వాడుకోనివి చాలా ఉన్నాయి. ఘరానా మొగుడు-రౌడీ అల్లుడు-కొదమసింహం-ఛాలెంజ్-అభిలాష-ముఠామేస్త్రి-హిట్లర్-మాస్టర్-చూడాలని ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. వీటిని పెట్టుకుంటే మాస్ ఆడియన్స్ అంచనాలు పెరుగుతాయనో లేక ఎందుకొచ్చిన గొడవని వదిలేశారో మెగాస్టార్ టైటిల్స్ ఇప్పటిదాకా ఎక్కువ రీ యుజ్ కాకపోవడం అంటే విశేషమే