Begin typing your search above and press return to search.

`మా` అధ్య‌క్ష ప‌ద‌విలో తాయిలం ఏదైనా దాగి ఉందా?

By:  Tupaki Desk   |   27 Jun 2021 7:38 AM GMT
`మా` అధ్య‌క్ష ప‌ద‌విలో తాయిలం ఏదైనా దాగి ఉందా?
X
వ‌లం 950 మంది స‌భ్యులు లేదా ఆర్టిస్టు ఓట‌ర్లు ఉండే మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు ఎందుకింత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారాయి? ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ నాలుగైదు పేర్లు బ‌య‌ట‌కు రావ‌డం వెన‌క మ‌త‌ల‌బు ఏం ఉంది? `మా` ప‌ద‌విపైనే ఎందుకింత మోజు? ప్ర‌తిసారీ ఎన్న‌క‌ల వేళ‌ ఎందుకింత ర‌భ‌స‌? ఇలాంటి ఎన్నో య‌క్ష ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పేదెవ‌రు? .. తెలిసీ స‌మాధానం చెప్ప‌క‌పోయావో నీ బుర్ర వెయ్యి చెక్క‌ల‌గును విక్ర‌మార్కా? అని మా మెంబ‌ర్లతో పాటు ప‌రిశ్ర‌మ జ‌నం అంతా వాపోతున్నారు.

`మా` ఎన్నిక‌ల ర‌భ‌స రోజుకి రోజుకి ఎక్కువవుతుంటే ఇలాంటి డౌట్లు ఎన్నో పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇదో సాధార‌ణ అసోసియేష‌న్ అని క‌వ‌రింగ్ ఇస్తూనే ఇప్పుడు అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఏకంగా న‌లుగురు పోటీప‌డుతున్నారు. ఇప్ప‌టికే పోటీ చేసిన వారు గ‌తంలో ఆ పోస్ట్ లో కుర్చున్న వారు ఇది నామ‌మాత్ర‌మే అని అంటున్నా ఇంకేదో డౌట్ వ్య‌క్త‌మ‌వుతోంది.

వాస్త‌వానికి సొంత ఆఫీస్ బిల్డింగ్ కూడా ఈ అసోసియేష‌న్ కి లేనేలేదు. అయితే ఈ ప‌ద‌విలో లేక‌పోతే ఏంటి న‌ష్టం? ప్ర‌ధాన ప‌ద‌వులు లేదా ఈసీ పోస్టుల్లో కానీ లాభం రాకుండానే ఇంత ర‌భ‌స దేనికి? ఎందుక‌ని ఇంత పోటీ వాత‌వార‌ణం ఏర్ప‌డుతోంది? అనేది ఫిల్మ్ న‌గ‌ర్ డిస్క‌ష‌న్..

ఈసారి అనూహ్యంగా మంచు విష్ణు పోటీ బ‌రిలోకి రావ‌డానికి రీజ‌న్ ఏంటి? ప్ర‌కాశ్ రాజ్ స‌డెన్ ఎంట్రీకి కార‌ణం ఏంటి? ఆ ఇద్ద‌రి వెన‌కా ఎవ‌రున్నారు? మ‌హిళామ‌ణుల‌కే ఈసారి ప‌ద‌వి ఇవ్వాళి అంటూ ఇటీవ‌లి ప్రెసిడెంట్ న‌రేశ్ స‌డెన్ గా స్వరం మార్చ‌డం వెన‌క అంత‌రార్థం ఏమిటో..! ఇంత‌కీ మా అధ్య‌క్ష ప‌ద‌విలో ఏం ఉంది..? అంత‌గా తాయిలం ఏదైనా దిగి ఉందా? నిధి చుట్టూ సాగే డ్రామాలు .. విదేశీ షోలు.. ఎన్నారైల నుంచి గౌర‌వం గుర్తింపు ఇలాంటి వాటి కోస‌మేనా? లేక అధ్య‌క్ష ప‌ద‌వి గౌర‌వంతో న‌టుడు లేదా న‌టిగా అవ‌కాశాల కోస‌మా? గ‌తంలో శివాజీరాజా అధ్య‌క్షుడుగా ఉన్న‌ప్పుడు ఏదో పెద్ద ఎత్తున స్కామ్ జ‌రిగింద‌నే క‌థ‌నాలు హ‌ల్ చ‌ల్ చేసాయిగా.. అయినా ఆ ప‌ద‌విపైనే మోజేలా? ఈ య‌క్ష ప్ర‌శ్న‌ల‌న్నిటికీ స‌మాధానం తెలిసీ చెప్ప‌క‌పోయావో....! రాజా నీ బుర్ర వెయ్యి చక్క‌ల‌గును.