Begin typing your search above and press return to search.
MAA లో గొప్ప ట్విస్టు... సీసీ ఫుటేజీకి పోలీసుల తాళం!
By: Tupaki Desk | 17 Oct 2021 10:34 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం(మా) ఎన్నికలు పూర్తయి మంచు విష్ణు అధ్యక్షుడిగా ఖరారైన సంగతి తెలిసిందే. ఇరు ప్యానెల్ లో గెలిచిన వారి వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఎన్నికలు ముగిసినా ఇంకా పట్టు విడుపు లేదు అంటూ ప్రకాష్ రాజ్ వర్గం పోరు సాగిస్తోంది. ఎలక్షన్ అనంతరం రకరకాల ట్విస్టులు తెలిసిందే. ముఖ్యంగా మోహన్ బాబు వర్గం రౌడీయిజానికి పాల్పడ్డారని దురుసుగా ప్రవర్తించారని ప్రకాష్ రాజ్ వర్గం ఆరోపించింది. విష్ణు- మనోజ్ హుందాగా వ్యవహరించినా పెద్దాయన వ్యవహారంపై సినిమా బిడ్డలం ప్యానెల్ గుర్రుమీదుంది.
ఇకపోతే ఎన్నికల రోజు సీసీ ఫుటేజ్ ని తమకు ఇవ్వాలని ప్రకాష్ రాజ్ వర్గం కోరగా.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ (తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది) అందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది కోర్టుల పరిధిలో అంశం. కోర్టు ద్వారా మాత్రమే ఇవ్వగలం అని జూబ్లీ పోలీస్ స్టేషన్ కి పంచాయితీని బదలాయించారు. ఆయన భీష్మించడంతో సీసీ ఫుటేజ్ ఉన్న గదికి తాళం వేసి ప్రస్తుతం అక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని కోర్టు వరకూ తీసుకెళ్లేందుకు ప్రకాష్ రాజ్ వర్గం ప్రయత్నిస్తోందని కథనాలొస్తున్నాయి. తాజా పరిణామాలతో సీసీ ఫుటేజ్ లో ఏం ఉంది? అన్న క్యూరియాసిటీ మొదలైంది. అయిపోయిన పెళ్లికి బ్యాండ్ మేళం అన్న చందంగా మా ఎన్నికల వ్యవహారంలో ట్విస్టులు ఇంకా ఇంకా వేడెక్కిస్తూనే ఉన్నాయి.
మా ఎన్నికలు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆ స్కూల్ గదిలోనే ఉంది. దీనికి ఇప్పుడు హైసెక్యూరిటీ అవసరమైంది. కోర్టు డైరెక్షన్ లోనే సీసీ ఫుటేజ్ ని ఇస్తామని అంటున్నారు కాబట్టి ప్రకాష్ రాజ్ వర్గం ఏం ఆలోచిస్తుందన్నది కాస్త ఆగితే కానీ తేలదు. ఇక ఈ ఎన్నికల్లో గొప్ప మెజారిటీ తో గెలుపొందిందని మొదటిరోజు ప్రకటించినా యాంకర్ అనసూయను మళ్లీ ఓడిపోయింది అంటూ ఎన్నికల అధికారులు ఆ మరుసటి రోజు ప్రకటించారు. దీనిపై సినిమా బిడ్డలం ప్యానెల్ సందేహాలు వ్యక్తం చేసింది.