Begin typing your search above and press return to search.

బాలీవుడ్ మీడియా ఇంత అక్కసు దేనికి..?

By:  Tupaki Desk   |   5 Nov 2022 7:34 AM GMT
బాలీవుడ్ మీడియా ఇంత అక్కసు దేనికి..?
X
సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో అద్భుతాలు సృష్టిస్తున్నాయనో లేక వారి సినిమాలు సరైన సక్సెస్ అవ్వట్లేదనో కానీ బాలీవుడ్ మీడియా సౌత్ సినిమాల మీద ఛాన్స్ దొరికినప్పుడల్లా తన అక్కసు చూపిస్తుంది. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టడాన్ని యాక్సెప్ట్ చేయని అక్కడ మీడియా సౌత్ సినిమాలు ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతున్నారు. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియా సౌత్ సినిమాల మీద మరోసారి తన అసలు రంగు బయట పడేలా చేసింది. షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న పఠాన్ సినిమా టీజర్ రీసెంట్ గా బాద్షా బర్త్ డే రోజు రిలీజ్ చేశారు.

యాక్షన్ అడ్వెంచర్ గా వస్తున్న ఈ పఠాన్ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ పేలవంగా ఉండటంతో మీడియా దాన్ని హైలెట్ చేస్తూ వార్తలు రాశారు. ముఖ్యంగా సౌత్ మీడియా పఠాన్ టీజర్ లో గ్రాఫిక్స్ పై ఎటాక్ చేసింది. వందల కోట్ల బడ్జెట్ పెట్టే వారు కనీసం వి.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ సరిగా చేయకపోవడం ఏంటని సౌత్ మీడియా ఓ రేంజ్ లో ఏసుకుంది.

అయితే దీనికి కౌంటర్ గా పఠాన్ సినిమా యూనిట్ కన్నా అక్కడ మీడియా పఠాన్ సినిమాకు సపోర్ట్ చేస్తూ ప్రభాస్ సాహో సినిమా గ్రాఫిక్స్ ని ఉదహరణగా చూపిస్తున్నాయి. సాహో కన్నా పఠాన్ గ్రాఫిక్స్ బాగానే ఉన్నాయంటూ హడావిడి చేస్తున్నారు.

బాహుబలితో ప్రభాస్ నేషనల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోగా.. ఓ సౌత్ స్టార్ బాలీవుడ్ కోట మీద ఈ రేంజ్ పాపులారిటీ తెచ్చుకోవడాన్ని జీర్ణించుకోలేని అక్కడి మీడియా రకరకాల వార్తలతో ప్రభాస్ ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నాయి. అయితే సౌత్ మీడియా అలా కాదు.. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాలీవుడ్ హీరోలకి కూడా ఇక్కడ సపోర్ట్ అందిస్తున్నారు. కానీ ముంబై మీడియా మాత్రం సౌత్ హీరోలని వారి సినిమాలను మెయిన్ టార్గెట్ గా చేస్తున్నాయి.

బాలీవుడ్ మీడియా ఇలా తన అక్కసు చూపిస్తున్నా సరే మన సినిమాలు అక్కడ ప్రభంజనాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. పుష్ప 1, ఆర్.ఆర్.ఆర్, కె.జి.ఎఫ్ 2, కార్తికేయ 2, కాంతార లాంటి సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై తమ సత్తా చాటాయి. ఓ పక్క బాలీవుడ్ స్టార్ సినిమాలు కూడా వరుస ఫ్లాపులు అవుతున్న టైం లో సౌత్ సినిమాలు బీ టౌన్ లో సృష్టిస్తున్న సంచలనాలు అక్కడ మీడియాని నిద్రపట్టకుండా చేస్తున్నాయి.

బాలీవుడ్ హీరోలే సౌత్ సినిమాల సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంటే అక్కడ మీడియా మాత్రం ఈ సెపరేషన్ చూపిస్తుంది. అయితే త్వరలో అక్కడ మీడియా కళ్లు కూడా తెరిపించేలా మరిన్ని సౌత్ సినిమాలు బాలీవుడ్ లో విజయ దుంధుంబి మోగిస్తాయని చెబుతున్నారు సౌత్ సినీ విశ్లేషకులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.