Begin typing your search above and press return to search.
రాజమౌళి పై అతనికెందుకంత కడుపుమంట!
By: Tupaki Desk | 6 Dec 2022 2:30 AM GMTదర్శశిఖరం రాజమౌళి ఎదుగుదలని చూసి కొంత మంది బాలీవుడ్ మేధావులు జీర్ణించుకోలేకపోతున్నారా? జక్కన్న ఎన్.వై.సీసీ పురస్కారం అందుకున్న తర్వాత మరింతగా కడుపుమంటతా రగిలిపోతున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. భారతీయ చిత్రాన్ని( ఆర్ ఆర్ ఆర్) ఆస్కార్ రేసులో నిలపాలని రాజమౌళి ఎంతగా కృషి చేస్తున్నరో కళ్ల ముందు కనిపిస్తునే ఉంది.
జనరల్ క్యాటగిరీ విభాగంలో ఆస్కార్ కి నామినేట్ చేయాలని చేయాల్సిన ప్రయత్నాలన్ని చేస్తున్నారు. జక్కన్న ఇంతలా కష్టపడుతుటే? కొంత మంది మేధావులు తీరు చూస్తుంటే ఆయన్ని కాళ్లు పట్టుకుని వెనక్కి లాగుతున్నట్లే కనిపిస్తుంది. బాలీవుడ్ లో కొంత మంది సీనియర్ దర్శకులు...రచయితలు..మేథావులు...ఉద్దండులు అంతా కలిసి చేస్తోన్న ఘనకార్యమిది.
ఆయనపై అసంబద్దమైన వ్యాఖ్యలు చేయడం సహా వ్యవహార శైలి రాజమౌళి అభిమానుల్నిఆగ్రహించేలా చేస్తుంది. ప్రముఖ రచయితగా చెలామణి అవుతోన్న అసీమ్ చాబ్రా రాజమౌళిని అపహస్యం చేసేలా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈయన ఇండియా నుంచి వెళ్లి న్యూయార్క్ లో స్థిరపడి బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. రాజమౌళి ఇష్టపడిన 10 హాలీవుడ్ చిత్రాల గురించి ఓ బ్రిటన్ పత్రిక ప్రచురించగా... వాటిని షేర్ చేసి అందులో 'ఫారెస్ట్ గంప్'.. 'దిలయన్ కింగ్' చిత్రాల్ని ప్రజలంతా ఓ సారి గమనించాలి అంటూ ట్యాగ్ చేసాడు.
హాలీవుడ్ నుంచి రాజమౌళికి వస్తోన్న గుర్తింపుకి దీన్ని ఓ సెటైర్ లా ట్రీట్ చేసాడు. ఆయనిలా చేసాడంటే? ఆయన ఎందుకలా రియాక్ట్ అయ్యాడో? కూడా ప్రేక్షక ప్రజలంతా కూడా ఓ సారి ఆలోచించాల్సిందే. రాజమౌళి అంచనా తప్పే అయినా? ఫలానా సినిమాకు అవార్డు ఎలా వస్తుంది? ఏ సినిమాకైనా మెరిట్ ఆధారంగానే అవార్డు దక్కుతుంది. అలాంటప్పుడు తనకు నచ్చిన సినిమాల ఎంపికకు- దానికి సంబంధం ఏమిటి? సార్ అంటూ రివర్స్ పంచ్ పడింది.
ముందు మీరంతా కలిసి బాలీవుడ్ కి సరైన హిట్ ఇవ్వండి...సౌత్ సినిమాలతో ఎలా పోటీ పడాలో ఆలోచించండి. ఇలాంటి కోడుగుడ్డు మీద ఈకలు పీకే విధానం వద్దూ అంటూ నెటి జనులు కొందరు తగులుకున్నారు. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా స్పందించారు. జక్కన్న పై వ్యతిరేక వ్యాఖ్యలకు ఖచ్చితమైన ఖండన ఇచ్చారు.
'కొంతమంది స్వయం ప్రకటిత మేధావులకు సినిమాలకు మరియు సినీ కళాకారులకు ప్రపంచవ్యాప్త గుర్తింపును జీర్ణించుకోలేక ముక్కున వేలేసుకోవడం సరదాగా ఉంటుంది. వారు మేధోసంపత్తి కలిగి ఉన్నారని మరియు చాలా మందికి బాగా తెలుసునని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు ఇంకా లోతుగా విశ్లేషించాలంటూ' బధులిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.