Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు?

By:  Tupaki Desk   |   12 Sep 2022 5:30 PM GMT
మ‌హేష్ ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు?
X
రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజుకు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఘ‌న‌మైన నివాళే అర్పించింది. నిన్న తెల్ల‌వారుజామున ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలిసిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇండ‌స్ట్రీ జ‌నాలు కండోలెన్స్ మెసేజ్‌లతో ఆయ‌న‌పై త‌మ గౌర‌వాన్ని చాటుకున్నారు. ఇక రెబ‌ల్ స్టార్ పార్థివ దేహం ఆయ‌న ఇంటికి చేరుకున్నాక ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులంద‌రూ అక్క‌డికి వ‌చ్చి ఆయ‌నకు నివాళి అర్పించారు.

ఐతే ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రు వ‌చ్చిన‌పుడు ప్ర‌భాస్ చాలా ఎమోష‌న‌ల్ అవ‌డం, క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం అంద‌రూ చూశారు. ఐతే కృష్ణంరాజుకు నివాళి అర్పించి వెళ్తూ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి గురి కావ‌డం, క‌న్నీళ్ల‌తో అక్క‌డి నుంచి నిష్క్ర‌మించ‌డం అభిమానుల‌ను క‌దిలించేసింది.

గ‌తంలోనూ మ‌హేష్ బాబు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు చ‌నిపోయిన‌పుడు నివాళి అర్పించి వెళ్లాడు. కానీ ఇంత ఎమోష‌న‌ల్ ఎప్పుడూ అవ‌లేదు. కృష్ణంరాజుతో అత‌డికి మంచి అనుబంధ‌మే ఉండొచ్చు. ఐతే మ‌హేష్ అంత‌గా ఉద్వేగానికి గురి కావ‌డానికి ఇదొక్క‌టే కార‌ణం కాద‌ని.. ఆ స‌మ‌యంలో త‌న అన్న‌య్య ర‌మేష్ బాబు గుర్తుకొచ్చి ఉండొచ్చ‌ని అభిమానులు భావిస్తున్నారు. మ‌హేష్ క‌రోనా బారిన ప‌డి ఐసొలేట్ అయిన స‌మ‌యంలో ర‌మేష్ చ‌నిపోయారు.

దీంతో ఇల్లు దాటి బ‌య‌టికి రాలేక మ‌హేష్ త‌న అన్న‌య్య క‌డ‌సారి చూపుకీ నోచుకోలేదు. బ‌హుశా మ‌హేష్‌ను ఆ బాధ వెంటాడి ఉండొచ్చ‌ని.. ర‌మేష్ మ‌ర‌ణానంత‌రం మ‌హేష్ ద‌ర్శించిన పార్థివ దేహం కృష్ణంరాజుదే కావ‌డంతో త‌న అన్న‌య్య గుర్తుకు వ‌చ్చి అంత ఎమోష‌న‌ల్ అయి ఉంటాడ‌ని భావిస్తున్నారు. ర‌మేష్ అనారోగ్యంతో ఈ ఏడాది జ‌న‌వ‌రిలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.