Begin typing your search above and press return to search.
అల్లు వారబ్బాయి సైలెన్స్ దేనికో?
By: Tupaki Desk | 11 Nov 2019 12:46 PM GMTఅల్లు వారసుడు శిరీష్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. 2013లో మొదలైన ప్రయాణం ఈ ఆరేళ్లలో ఆశించినంతగా టేకాఫ్ అవ్వలేదు. ఇప్పటికే అరడజను సినిమాల్లో నటించాడు. అందులో కొత్త జంట- శ్రీరస్తు శుభమస్తు యావరేజ్ గా ఆడినా అటుపై సరైన హిట్టు పడలేదు. మలయాళంలో విజయం సాధించిన ఏబీసీడీని అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. కానీ ఫలితం ఆశించినట్టు రాలేదు. మరో పరాజయం నిరాశపరిచింది. అయితే ఆ తర్వాత శిరీష్ వేరొక కొత్త సినిమాని ఎందుకు ప్రకటించలేదు? ఆ సినిమా విడుదలై ఆరు నెలలు కావస్తున్నా..ఎందుకీ డైలమా? అంటూ ఫిలింనగర్ గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
శిరీష్ సైలెన్స్ దేనికోసమో! సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నాడా? లేక సొంత బ్యానర్ కాకుండా బయటి నిర్మాత ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తున్నాడా? లేక సరైన రీమేక్ కథ కోసం కాచుకుని కూర్చున్నాడా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓవైపు అల్లు అరవింద్ బయట స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ప్లాప్ డైరెక్టర్లకు అయినా ఛాన్సులిస్తున్నా.. తనయుడు విషయంలో మాత్రం ఆరంభంలో చూపించినంత ఉత్సాహం చూపించలేదన్న చిరు విమర్శ వినిపిస్తోంది. అటు శిరీష్ మౌనం వహిస్తుండడంతో అసలేమైంది? అంటూ అభిమానుల్లో సందేహాలకు తావిస్తోంది.
ఇక బన్ని ఏడాది గ్యాప్ తీసుకుని చివరికి త్రివిక్రమ్ తో కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తున్నాడు. సుక్కూతోనూ పట్టాలెక్కించేస్తున్నాడు. కానీ శిరీష్ మాత్రం ఇంకా సైలెంటుగానే ఉన్నాడు. మరి ఈ గ్యాప్ కి కారణం సరైన కథ లేకపోవడమేనా? ఇంకేదైనా కారణమా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం అరవింద్ సారథ్యంలో ప్రారంభించనున్న ఓటీటీ (వెబ్ సిరీస్) వేదికను శిరీష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారన్న టాక్ ఉంది. బహుశా అటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ నిర్మాతగా కొనసాగే ఆలోచన ఏదైనా శిరీష్ కి ఉందా? దానిపైనే పూర్తిగా దృష్టి సారించడం వెనక కారణమేమిటి? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి ఈ ప్రశ్నలన్నిటికీ అతడే స్వయంగా ఆన్సర్ ఇస్తాడేమో చూడాలి.