Begin typing your search above and press return to search.
అదే ప్రశాంత్ నీల్ ని టెన్షన్ పెడుతోందట!
By: Tupaki Desk | 12 April 2022 10:30 AM GMTయాష్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'కేజీఎఫ్ చాప్టర్ 2' మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఏప్రిల్ 14న మాసీవ్ గా భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కేజీఎఫ్ చాప్టర్ 1 కు ఫ్రాంజైజీగా వస్తున్న ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్నా కొద్దీ దర్శకుడిలో ఓ విషయంలో టెన్షన్ మొదలైందట. ఇదే విషయాన్ని తాజాగా మీడియాతో వెల్గడించారు.
మరో రెండు రోజుల్లో సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం తెలుగులో మీడియాతో ప్రత్యేకంగా సంభాషిస్తోంది. ప్రీ రిలీజ్ కి ముందు తెలుగు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రం పై పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫైనల్ అయిపోయింది. మరో రెండు రోజుల్లో 'కేజీఎఫ్ చాప్టర్ 2' రిలీజ్ కాబోతోంది ఈ నేపథ్యంలో మీ టెన్షన్ ఫ్రీ అయిపోయారా? అని అడిగితే ఆసక్తికరంగా సమాధానం చెప్పారు.
తాను చాలా నర్వస్ గానే వున్నానని, ప్రతీ సినిమా విషయంలోనూ ఫిల్మ్ మేకర్స్ లో సంతృప్తి కనిపించదని, ఛాన్స్ వుంటే ఫైనల్ అవుట్ పుట్ చూసుకున్నాక మరిన్ని మార్పులు చేస్తే బాగుండేదనే భావన కలుగుతుందని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా 'కేజీఎఫ్ 2'పై నెలకొన్న మాసీవ్ ఎక్స్ పెక్టేషన్స్, ట్రిపుల్ ఆర్, బాహుబలి చిత్రాలతో పోల్చి చూస్తున్న తీరు తనని మరింత టెన్షన్ కు గురిచేస్తోందన్నారు. ఫ్రాంచైజీస్ వర్కవుట్ అయిన సందర్భాలు చాలా తక్కువ కానీ ఆ సెంటిమెంట్ ని బాహుబలి బీట్ చేసింది. అదే దారిలో మీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా?
అని అడిగితే సీక్వెల్స్, ఫ్రాంచైజీలకున్న ట్రాక్ రికార్డ్ ని పరిశీలిస్తే నాకు భయమేస్తోంది. అయితే సీక్వెల్స్ తో పోలిస్తే ఫ్రాంచైజీలకున్న అడ్వాంటేజీ చాలా ఎక్కువ. ఆ సెంటిమెంట్ ప్రకారం కేజీఎఫ్ 2 కూడా అంచనాలని అందుకుంటుందని, భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని ప్రశాంత్ నీల్ తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా వుంటే ఈ మూవీ బడ్జెట్ గురించి అడిగిన ప్రశ్నకు దర్శకుడు ప్రశాంత్ నీల్ కొంత అసహనాన్ని ప్రదర్శించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
జక్కన్న ట్రిపుల్ ఆర్ బడ్జెట్ ని ఓపెన్ గా చెప్పేస్తే ప్రశాంత్ నీల్ మాత్రం బడ్జెట్ గురించి అడిగితే అసహనాన్ని వ్యక్తం చేయడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది, కేజీఎఫ్ 2 రిలీజ్ విషయంలో ఇప్పటికే నేను చాలా నెర్వస్ గా వున్నాను. ఇలాంటి సమయంలో ఎందుకు బడ్జెట్ గురించి అడుగుతున్నారు? .. ఆ విషయంలో ప్రొడ్యూసర్ చాలా క్లియర్ గా వున్నారు. దర్శకుడిగా నా సినిమాకు ఏది అవసరమో అది అడిగాను.. దాన్ని నిర్మాత సమకూర్చారు దట్స్ ఆల్' అని చెప్పారు ప్రశాంత్ నీల్. బడ్జెట్ విషయంలో దర్శకుడు ఎందుకిలా ఇబ్బందిపడుతున్నారన్నది పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇదిలా వుంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సంచలనాలు సృష్టించడం ఖాయమని, ఈ విషయంలో పూర్తి కాన్ఫిడెంట్ తో దర్శకుడు వున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కాన్ఫిడెన్స్ ఎంత వరకు నిజమవుతుందన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.