Begin typing your search above and press return to search.
#ఫ్రస్టేషన్.. నాకు నచ్చలేదు అని అరిచేలా ఉన్న యంగ్ డైరెక్టర్!!
By: Tupaki Desk | 25 Jan 2021 12:30 AM GMTమొత్తం మీరే చేశారు! .. మొత్తం మీరే చేశారు..!! చాలు నాన్న.. చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు.. నేను కోల్పోయింది చాలు.. ఇంకా వద్దు ప్లీజ్. ఇంకా అర్థం కాలేదా మీకూ.. ఈ ఇంటికొచ్చినప్పుడు హాసిని ఏం ఉందో ..ఆ ఆనందం .. చిన్ని చిన్ని ఆనందం.. కోల్పోయాను నాన్నా..(సిద్ధార్థ్)
``నీ గురించి నేను వెయ్యి సార్లు ఆలోచిస్తాను కదరా?`` (ప్రకాష్ రాజ్) .. అవును.. వెయ్యి సార్లు వాడికి బావుంటుందని ఆలోచిస్తారు తప్ప ఒక్కసారైనా నచ్చుతుందా అని ఆలోచించారా? (సిద్ధార్థ్)
అడిగిన దాని కన్నా ఎక్కువ ఇవ్వడంలో శాటిస్ ఫ్యాక్షన్ మీకు తెలుసు. కోరుకున్నది దొరక్కపోతే ఉండే బాధ మీకు తెలీదు. నాకు తెలుసు.. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది..నాకు ఏది ఇష్టమో కాదో .. ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే నాతో మాట్లాడండి నాన్నా.. నా కళ్లు చూసి మాట్లాడండి.. ఫ్రెండ్లీగా ఉండండి నాన్నా..చివరికి స్నేహితులకు చెప్పుకుని బాధపడేవాడిని..
ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు.. మీరే సూపర్ అంటారు. కన్విన్స్ చేసేస్తారు. నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. ఆఫీస్ కి పంపిస్తారు. నేను వెళతాను అక్కడికి వెళ్లే లోపు మీరే ఆ పని చేసేస్తారు.. రేయ్ కేరమ్స్ అని పిలుస్తారు. నేనేదో ఆడాలనుకుంటాను. మీరే ఆడేస్తారు .. గెలిపించేస్తారు..
.. ఇదంతా `బొమ్మరిల్లు` మూవీలో భారీ ఎమోషనల్ సీన్ అని అందరికీ తెలుసు. అతి మంచోడైన నాన్నతో వేగలేని కొడుకుగా సిద్ధార్థ్ లోని ఎమోషనల్ సీన్ ఎంత బాగా వర్కవుటైందో కూడా తెలుసు. ఇప్పుడు ఇదే సన్నివేశంలో టాలీవుడ్ లో ఓ యంగ్ డైరెక్టర్ ఉన్నాడు. సదరు యంగ్ డైరెక్టర్..`` నాకు నచ్చలేదు`` అని అరవాలనుకునేంత ఎమోషన్ లో ఉన్నాడట.
ఎలాగూ ఈ సినిమా చేయడం కారణంగా నాకు లాస్ తప్ప లాభం లేదు..! ఏదో పెద్ద హీరో తో సినిమా చేసా అనే పేరు తప్పితే...! నా పరిస్థితి కూడా ఏదో మాదిరిగా అయిపోతుందని ఆ రీమేక్ డైరెక్టర్ తన సన్నిహితులు దగ్గర వాపోతున్నాడట...! అయితే దీనికి కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే.. ఈ రీమేక్ లో అటు నిర్మాతగా ఆల్రేడీ ఎంట్రీ ఇచ్చిన ఓ పాపులర్ డైరెక్టర్ ఇప్పుడు రైటర్ గా అలానే దర్శకత్వ పర్యవేక్షడుగా మొత్తం తానై నడిస్తున్నారట..! అయితే కొన్ని విషయాల్లో ఇది బాగానే ఉంటోంది కానీ .. ఇప్పుడు భరించలేనంత వేరే లెవల్ కి వెళ్లిందని టాక్ ఉంది..! సినిమాకి సంబంధించిన క్రియేటివ్ డెషిసన్ మొత్తం ఆయన చేతుల్లోకి వెళ్లిపోయిందట. దీంతో సదరు యంగ్ డైరెక్టర్ ఫ్రస్టేషన్ కి గురవుతున్నాడని తెలిసింది.
పాపం ఆ యంగ్ డైరెక్టర్ అటు ప్రాజెక్ట్ నుంచి బయటకు రాలేక .. ఇటు అందులో ఉండలేక సతమతమవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బొమ్మరిల్లు తండ్రి కొడుకుల ఎపిసోడ్ లా.. ఇక్కడ సీనియర్ డైరెక్టర్ జూనియర్ డైరెక్టర్ ఎపిసోడ్ సాగుతోందన్న విషయం అర్థమైపోతోంది మరి.
``నీ గురించి నేను వెయ్యి సార్లు ఆలోచిస్తాను కదరా?`` (ప్రకాష్ రాజ్) .. అవును.. వెయ్యి సార్లు వాడికి బావుంటుందని ఆలోచిస్తారు తప్ప ఒక్కసారైనా నచ్చుతుందా అని ఆలోచించారా? (సిద్ధార్థ్)
అడిగిన దాని కన్నా ఎక్కువ ఇవ్వడంలో శాటిస్ ఫ్యాక్షన్ మీకు తెలుసు. కోరుకున్నది దొరక్కపోతే ఉండే బాధ మీకు తెలీదు. నాకు తెలుసు.. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది..నాకు ఏది ఇష్టమో కాదో .. ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే నాతో మాట్లాడండి నాన్నా.. నా కళ్లు చూసి మాట్లాడండి.. ఫ్రెండ్లీగా ఉండండి నాన్నా..చివరికి స్నేహితులకు చెప్పుకుని బాధపడేవాడిని..
ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు.. మీరే సూపర్ అంటారు. కన్విన్స్ చేసేస్తారు. నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. ఆఫీస్ కి పంపిస్తారు. నేను వెళతాను అక్కడికి వెళ్లే లోపు మీరే ఆ పని చేసేస్తారు.. రేయ్ కేరమ్స్ అని పిలుస్తారు. నేనేదో ఆడాలనుకుంటాను. మీరే ఆడేస్తారు .. గెలిపించేస్తారు..
.. ఇదంతా `బొమ్మరిల్లు` మూవీలో భారీ ఎమోషనల్ సీన్ అని అందరికీ తెలుసు. అతి మంచోడైన నాన్నతో వేగలేని కొడుకుగా సిద్ధార్థ్ లోని ఎమోషనల్ సీన్ ఎంత బాగా వర్కవుటైందో కూడా తెలుసు. ఇప్పుడు ఇదే సన్నివేశంలో టాలీవుడ్ లో ఓ యంగ్ డైరెక్టర్ ఉన్నాడు. సదరు యంగ్ డైరెక్టర్..`` నాకు నచ్చలేదు`` అని అరవాలనుకునేంత ఎమోషన్ లో ఉన్నాడట.
ఎలాగూ ఈ సినిమా చేయడం కారణంగా నాకు లాస్ తప్ప లాభం లేదు..! ఏదో పెద్ద హీరో తో సినిమా చేసా అనే పేరు తప్పితే...! నా పరిస్థితి కూడా ఏదో మాదిరిగా అయిపోతుందని ఆ రీమేక్ డైరెక్టర్ తన సన్నిహితులు దగ్గర వాపోతున్నాడట...! అయితే దీనికి కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే.. ఈ రీమేక్ లో అటు నిర్మాతగా ఆల్రేడీ ఎంట్రీ ఇచ్చిన ఓ పాపులర్ డైరెక్టర్ ఇప్పుడు రైటర్ గా అలానే దర్శకత్వ పర్యవేక్షడుగా మొత్తం తానై నడిస్తున్నారట..! అయితే కొన్ని విషయాల్లో ఇది బాగానే ఉంటోంది కానీ .. ఇప్పుడు భరించలేనంత వేరే లెవల్ కి వెళ్లిందని టాక్ ఉంది..! సినిమాకి సంబంధించిన క్రియేటివ్ డెషిసన్ మొత్తం ఆయన చేతుల్లోకి వెళ్లిపోయిందట. దీంతో సదరు యంగ్ డైరెక్టర్ ఫ్రస్టేషన్ కి గురవుతున్నాడని తెలిసింది.
ఆసక్తికరంగా సదరు పెద్ద డైరెక్టర్ ఫింగరింగ్ కి కారణం వెనక వేరొక మతలబు తాజాగా బయటపడింది. నిజానికి ఆ పెద్ద హీరోతో కుర్ర డైరెక్టర్ కి ఛాన్స్ రావడానికి కారణం నిర్మాణ సంస్థ. ఆ రీమేక్ మూవీ రైట్స్ అతడి వద్ద ఉండడంతో ఆ డైరెక్టర్ నే బరిలో దింపి అవకాశం కల్పించేశారు. అయినా పెద్ద డైరెక్టర్ ని హీరోగారు బరిలో దించడంతో సమస్య మొదలైంది. క్రియేటివ్ పార్ట్ లో ఆయనదే చెల్లుతుండడంతో సదరు యువ డైరెక్టర్ లో ఎమోషన్ కట్టలు తెంచుకుంటోందట.