Begin typing your search above and press return to search.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎందుకిలా చేస్తున్నాడు?
By: Tupaki Desk | 25 Nov 2022 2:30 AM GMTదర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా వండర్ `RRR`. ఈ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హాలీవుడ్ స్టార్స్, మేకర్స్ సైతం ఈ మూవీతో పాటు ఇందులో నటించిన ఎన్టీఆర్, చరణ్ ల గురించి కామెంట్ లు చేస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా అన్ని భాషల ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఫేవరేట్ స్టార్స్ గా మారారు.
ఈ మూవీ రిలీజ్ తరువాత ఆ క్రేజ్ కి అనుగుణంగా రామ్ చరణ్ వరుస కమర్షియల్ యాడ్స్ లలో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఓ పక్క శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తూనే ఏ చిన్న గ్యాప్ దొరికినా చరణ్ కమర్షియల్ యాడ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ వరుస యాడ్ లలో నటిస్తున్నాడు. చరణ్ కన్నా ముందు మహేష్, `పుష్ప` క్రేజ్ తో అల్లు అర్జున్ ఎడా పెడా కమర్షయిల్ యాడ్ లకు బ్రాండ్ అంబాసిడర్ లుగా మారి వరుస యాడ్ లలో నటించారు.
అల్లు అర్జున్ మాత్రం ర్యాపీడో, జొమాటో, శ్రీచైతన్య కాలేజెస్.. పీవీసీ పైప్ యాడ్, కెఎఫ్ సీ యాడ్ లలో నటించడం తెలిసిందే. వీరంతా తమకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్న వేళ ఎన్టీఆర్ మాత్రం కాస్త లేట్ గా కమర్షియల్ బ్రాండ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. లేట్ గా కమర్షియల్ యాడ్ ల రేస్ లోకి ఎంటరయ్యాడు. రీసెంట్ గా ఫ్రెష్ మీట్ అండ్ ఫిష్ కి సంబంధించిన హోమ్ ఫుడ్స్ డెలివరీ యాప్ `లీసియస్` కి బ్రాండ్ అంబాసిడర్ గా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
రాహుల్ రామకృష్ణతో కలిసి ఎన్టీఆర్ ఈ కమర్షియల్ యాడ్ లో నటించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా వుంటే అల్లు అర్జున్, రామ్ చరణ్ లు డిమాండ్ చేస్తున్న అమౌంట్ కు తక్కువగా ఎన్టీఆర్ కోట్ చేస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అల్లు అర్జున్ ఒక్కో కమర్షియల్ యాడ్ కి దాదాపు రూ.8కోట్లు తీసుకుంటున్నారట.
రామ్ చరణ్ 7 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అయితే ఎన్టీఆర్ మాత్రం కేవలం రెండు కోట్లు మాత్రమే తీసుకోవడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. ఎన్టీఆర్ ఎందుకిలా చేస్తున్నాడని కొంత మంది ఆరా తీస్తుంటే ఫ్యాన్స్ మాత్రం తెలుగు యాడ్ లు కావట్టే ఎన్టీఆర్ అంత తక్కువ కోట్ చేస్తున్నారని చెబుతున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.