Begin typing your search above and press return to search.
వివాహేతర సంబంధం.. 40 ప్లస్ బ్యూటీతో కుర్రహీరో ?
By: Tupaki Desk | 22 May 2021 3:27 AM GMTసంఘంలో వివాహేతర సంబంధాలన్నీ చాలా విచిత్రమైనవి. వయసు తో సంబంధం లేని వ్యామోహంలో చిన్నా పెద్దా అనే వయోభేధం ఉండదు. వావి వరసల్ని పట్టించుకోరు. అలాంటి ఎఫైర్ కథలతో సినిమాలు తీయడంలో ఇండస్ట్రీలో సిద్ధహస్తులున్నారు. ఇప్పుడు ధర్మా ప్రొడక్షన్స్ అధినేత అదే బాటలో వెళుతున్నారు. ఇన్నాళ్లు క్లాసిక్ అనదగ్గ చిత్రాల్ని నిర్మించిన కరణ్ జోహార్ కుటుంబకథల స్థానంలో విలక్షణమైన నేపథ్యాలను ఎంచుకోవడం రక్తి కట్టిస్తోంది. వెబ్ సిరీస్ లు వెబ్ సినిమాల ట్రెండ్ లోనే సినిమా తీరు తెన్నులు అమాంతం మారిపోతున్నాయడానికి ఈ మార్పులు ఆధారంగా నిలుస్తున్నాయి.
ఇటీవలే షకున్ బాత్రా తో ధర్మ బ్యానర్ తదుపరి ప్రాజెక్ట్ను ప్రకటించినప్పుడు - దీపికా పదుకొనే- సిద్ధాంత్ చతుర్వేది - అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తారని ప్రచారమైంది. మేకర్స్ ఇంకా అనన్య సరసన నటుడి కోసం వెతుకుతున్నారు. ఈ బృందం చివరకు ప్రతిభావంతుడైన `ధైర్య కార్వా`ను లాక్ చేశారని ప్రచారమైంది. అలాగే అవినాష్ తివారీ పేరు పరిశీలనలో ఉన్నా ధైర్య అంతిమంగా ఓకే అయ్యాడు.
ఈ చిత్రంలో దీపికా పదుకొనే సరసన ఇషాన్ ఖట్టర్ ఎందుకు నటించడంలేదు? అంటూ మరో ఆసక్తికర చర్చా మొదలైంది. సిద్ధాంత్ తో పాటు అనన్య ప్రస్తుత ప్రియుడు ఇషాన్ ఖట్టర్ రేస్ లో ఉన్నాడన్నది తెలిసినదే. ప్రారంభంలో యువ తారాగణంతో దీన్ని రూపొందించాలనేది ప్రణాళిక. దానికి కారణం.. ఇది చాలా ఆసక్తికర కాన్సెప్ట్. వాణిజ్యపరంగా కాకపోయినా...డీప్ గా చాలా మ్యాటర్స్ ఉన్న కథాంశం కావడంతో యూత్ కావాలనుకున్నారు.
దీపిక - సిద్ధాంత్ పెయిర్ ని ఇప్పటికే కరణ్ లాక్ చేశారట. కానీ అలా ఎందుకు మార్చాల్సొచ్చింది? అన్నది ఆరా తీస్తే వేరొక షాడో థింగ్ బయటపడింది. కొన్ని ఒప్పందాలు పని చేయకపోవడంతో కరణ్ - ఇషాన్ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడం లేదని తెలిసింది. అందుకే ఈ చిత్ర కథ ధైర్య పాత్రతో సన్నిహితంగా ఉంటుంది. ఇందులో దీపిక పాత్ర ఆసక్తికరం. పూర్తిగా వివాహేతర సంబంధాల గురించి సంక్లిష్టమైన కథ లో దీపిక సరసన ఇషాన్ చాలా విచిత్రంగా కనిపించేవాడని కరణ్ భావించి తొలగించారట. అతను చాలా చిన్నవాడు అనిపించాడు అంటూ ఆయన అన్నారట.
ఇందులో ఫిట్ నెస్ బోధకురాలి పాత్రలో దీపిక నటించనుందని.. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సెలబ్రిటీ ఫిట్ నెస్ బోధకురాలి నిజజీవిత పాత్ర దీనికి స్ఫూర్తి అని ప్రచారమైంది. కానీ ధర్మ ప్రొడక్షన్స్ బృందం - రచయితలు దీనిని పూర్తిగా ఖండించారు. ఇందులో దీపిక ఫిట్ నెస్ ట్రైనర్ గా కాదు... ఔత్సాహికురాలిగా కనిపిస్తుందట.