Begin typing your search above and press return to search.

కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం ఎక్కడ ఎందుకు ఆగింది?

By:  Tupaki Desk   |   4 Dec 2019 6:37 AM GMT
కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం ఎక్కడ ఎందుకు ఆగింది?
X
సంచలన అంశాల్ని ముడిసరుకుగా చేసుకొని సినిమాలు తీయటం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటే. ఇప్పటికే పలు రియల్ అంశాల్ని రీల్ చిత్రాలుగా మలిచిన ఆయన.. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో సంచలన కథాంశాన్ని తెరకెక్కించటం తెలిసిందే.

ఈ చిత్రం ఎంత కల్పితమని చెబుతున్నా.. చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్.. కేఏ పాల్ లాంటి పాత్రలు నిజ జీవితంలో కనిపించే దానికి చాలా దగ్గరగా ఉండటం.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లు క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంత కాదు.

టీజర్ తోనే హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రం విడుదలైతే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లినప్పుడు అక్కడి అభ్యంతరాలతో సినిమా రిలీజ్ ఆగినట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి ఈ చిత్రం గత శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే.. సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. సర్టిఫికేట్ జారీ చేయటానికి అంగీకరించలేదు.

దీంతో చిత్ర విడుదల ఆగింది. అయితే.. పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఈ చిత్ర టైటిల్ ను అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మారుస్తామని చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పినా.. ప్రయోజనం లేకపోయింది. ఈ చిత్రంతో ఏపీలో రాజకీయ పరిస్థితులపై ప్రభావం చూపించటంతో పాటు.. కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.

తన చిత్రానికి సెన్సార్ ఓకే చెప్పకపోవటం.. చిత్ర పేరును మార్చేందుకు తాను సిద్దపడినా అందుకు అంగీకరించని నేపథ్యంలో రివ్యూ కమిటీ ముందుకు వర్మ వెళ్లినట్లుగా తెలుస్తోంది. మరి.. రివ్యూ కమిటీ దీనికి ఎలాంటి బదులు ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ.. సినిమా విడుదలకు ఓకే చేసినా.. పెద్ద ఎత్తున కట్స్ తప్పవన్న మాట వినిపిస్తోంది. మరీ విషయంలో వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.