Begin typing your search above and press return to search.

కట్టప్ప సీక్రెట్ పై స్వీట్ వార్నింగ్స్

By:  Tupaki Desk   |   27 April 2017 4:47 AM GMT
కట్టప్ప సీక్రెట్ పై స్వీట్ వార్నింగ్స్
X
బాహుబలి ది కంక్లూజన్ మూవీ రేపు.. అంటే ఏప్రిల్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. ఈరోజు రాత్రికే ప్రీమియర్లు పడుతున్నాయ్. అయితే.. కలెక్షన్స్ కోసం.. తొలి రోజు నాటికే వీలైనంత మొత్తాన్ని రాబట్టుకునేందుకు కోసం.. ముందు రోజు రాత్రి నుంచే థియేటర్లలో ప్రదర్శించేస్తున్నారు. అంటే ఇవాళ రాత్రి నుంచే బాహుబలి2 సందడి థియేటర్లలో మొదలైపోతోంది.

ఎక్కువ మంది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే సీక్రెట్ తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ విషయం తెలుసుకుని పదిమందికీ తామే చెప్పేయాలని తహతహలాడుతున్నారు. మీడియాలోను.. సోషల్ మీడియాలోనూ ఈ హంగామా ఎక్కువగా నడుస్తోంది. ఎఫ్ ఎం రేడియోలకు కూడా ఫోన్ చేసి.. ఈ సీక్రెట్ గురించి బయటకు చెప్పద్దని కొందరు జనాలు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫేస్ బుక్.. ట్విట్టర్ లలో కూడా కొన్ని బెదిరింపులు మొదలయ్యాయి. కట్టప్ప సీక్రెట్ చెప్పేస్తే అన్ ఫ్రెండ్ అయిపోతావ్ జాగ్రత్త అనేది వీటి సారాంశం. లేదా కట్టప్ప సీక్రెట్ గురించి చెప్పిన వాడిని గ్రూపుల నుంచి తొలగించేస్తారట.

ఎక్కడో మొదలెట్టిన ఓ మెసేజ్ ఇప్పుడు వైరల్ గా మారి బాగానే స్ప్రెడ్ అయింది. నిజానికి జనాల్లో ఉన్న ఆతృతకు పరాకాష్ట ఏంటో ఇది చెబుతుంది. నిజంగా సినిమా చూసే సీక్రెట్ తెలుసుకుని థ్రిల్ ఫీల్ అవ్వాలని భావించేవాళ్లు అలానే చేస్తారు. బాహుబలి గ్రాండియర్ కోసం మూవీ చూస్తారు. ఇలా ఎవడో పెట్టిన వైరల్ మెసేజ్ ని ఫార్వార్డ్ చేసి బెదిరించినంత మాత్రాన.. బాహుబలి సీక్రెట్ ఆగిపోతుందని అనుకోవడం భ్రమే.

ఈ విషయంలో వెబ్ సైట్లు.. రివ్యూ రైటర్లు సంయమనం పాటించచ్చేమో కానీ.. జనాలను ఆపగలిగే శక్తి ఎవరికీ ఉండదు. ఒక్క మెసేజ్ తో ఓ విషయాన్ని కప్పి పెట్టేయడమో.. రెచ్చగొట్టేయడమో అన్ని సార్లు జరిగే విషయం కాదు. ఈ విషయం ఇవాళ తెల్లారక మునుపే అర్ధమవుతుందిలే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/