Begin typing your search above and press return to search.

మ‌హేష్ కి బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు?

By:  Tupaki Desk   |   5 Nov 2019 7:28 AM GMT
మ‌హేష్ కి బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి కేంద్రం బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ ఇవ్వాల్సి వ‌చ్చిందా? అయితే అంత‌టి సాహ‌సోపోతమైన ప‌ని ఆయ‌నేం చేశారు? ఆయ‌న‌కు శ‌త్రువులు ఎవ‌రున్నారు? అంటూ సందేహాలు క‌ల‌గొచ్చు. అయితే దానికి కార‌ణ‌మేంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.

ఇంతకుముందే స‌రిలేరు నీకెవ్వ‌రు టీమ్ మ‌హేష్-అనీల్ రావిపూడి-అనీల్ సుంక‌ర బృందం క‌శ్మీర్ షూటింగుకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ఊహించ‌ని కొన్ని ప‌రిణామాల న‌డుమ ఊపిరి బిగ‌బ‌ట్టి షూటింగ్ చేశారు. అక్క‌డ ఏం తేడా జ‌రిగినా అంతే సంగ‌తి అన్న‌ట్టే ఉంద‌ట ప‌రిస్థితి.

స‌రైన స‌మ‌యంలో నిర్మాత‌లు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల‌నే అంతా స‌జావుగా సాగి తిరిగి హైద‌రాబాద్ కి రాగ‌లిగింది స‌రిలేరు టీమ్. అస‌లింత‌కీ ఏం జ‌రిగింది? అంటే.. క‌శ్మీర్ లో దుర్భేధ్య‌మైన‌ హ‌హ‌ల్గాం.. శ్రీ‌న‌గ‌ర్ ఏరియాల్లో ఈ సినిమాకి సంబంధించి నాలుగు వారాల పాటు చిత్రీక‌ర‌ణ సాగింది. ఇది రెండు నెల‌ల క్రితం మాట‌. అయితే స‌రిగ్గా ఈ షూటింగ్ స‌మ‌యంలోనే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. స‌డెన్ గా మోదీ ప్ర‌భుత్వం నుంచి ఆ ప్ర‌క‌ట‌న రాగానే వెంట‌నే స‌రిలేరు టీమ్ టెన్ష‌న్ కి గురైంది. ఓ వైపు ఉద్రిక్త ప‌రిస్థితి. ఎట్నుంచి ఏ ప్ర‌మాదం పొంచి ఉందోన‌న్న టెన్ష‌న్. ఆ క్ర‌మంలోనే నిర్మాత అనీల్ సుంక‌ర తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న ఎన్నో తంటాలు ప‌డి కేంద్ర భ‌ద్ర‌తా శాఖ‌ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి అనుమ‌తి తీసుకుని షూటింగును కొన‌సాగించారు. అలాగే మ‌హేష్ కి బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగానూ అనుమ‌తిలో కోరారు.

అందుకు అనుమ‌తులు ల‌భించాయి.. బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నం స‌హా బుల్లెట్ ప్రూఫ్ భ‌ద్ర‌తా సిబ్బంది మ‌హేష్ కి టీమ్ కి కాప‌లా కాసారు కాబ‌ట్టే మ‌హేష్ షూటింగ్ లో పాల్గొన‌గ‌లిగారు. ఎంతో క్లిష్ఠ‌త‌ర‌మైన రిస్కీ ప్లేస్ అయిన‌ ప‌హ‌ల్గాంకి చేర‌డ‌మే ఒక స‌వాల్ అనుకుంటే ఈ ప్ర‌త్యేక ప‌రిస్థితి ఊహించ‌నిది. ప్ర‌త్యేక భ‌ద్ర‌త న‌డుమ‌ నాలుగు వారాల షూటింగును పూర్తి చేసి తిరిగి క్షేమంగా హైద‌రాబాద్ కి చేరుకోగ‌లిగారు. ఇక షూటింగ్ అయిపోయాక 370 ఆర్టిక‌ల్ టెన్ష‌న్స్ త‌గ్గిన సంగ‌తి తెలిసిందే.