Begin typing your search above and press return to search.
చిరంజీవికి మణిరత్నం థాంక్స్ దేనికి?
By: Tupaki Desk | 20 Aug 2022 10:30 AM GMTమణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' మొదటి భాగం భారీ హంగులతో ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిన్నటి రోజున హైదరాబాద్ లో ఓసాంగ్ ని ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మణిరత్నం ఎంతో నిరాడంబరతని ప్రదర్శించారు.
దర్శక శిఖరం రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసారు. ''ఒక కథని రెండు భాగాలుగా ఎలా చెప్పాలో? రాజమౌళి 'బాహుబలి' సినిమాలో చూపించారని అతని గొప్పతనాన్ని చాటారు. బాహుబలి సినిమా వల్లే పొన్నియన్ సెల్వన్ సాధ్యమైందన్నా''రు. వాస్తవానికి పొన్నియన్ సెల్వన్ మొదలైనప్పుడే టాలీవుడ్ మీడియా ఈ రకమైన ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది.
సరిగ్గా అదే ఎనాలసిస్ ని మణిరత్నం నిన్నటి రోజున కన్పమ్ చేసారు. ఇక ఇదే వేదికపై మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. థాంక్స్ దేనికి చెప్పాను అన్నది తర్వాత చెబుతానన్నారు. దీంతో చిరంజీవికి- పొన్నియన్ కి సంబంధం ఏంటని నెట్టింట ప్రచారం మొదలైంది. నిన్నటి వేడుకకు చిరంజీవి హాజరైంది లేదు.
'పొన్నియన్ సెల్వన్' ప్రారంభమైన ర్వాత మణిరత్నం-చిరు కలిసింది కూడా జరగలేదు. అలాగని సినిమాలో చిరు ఏదైనా గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నారా? అంటే ఇంత వరకూ ఆ విషయం బయటకు రాలేదు. మరెందుకు మణిసర్ థాంక్స్ చెప్పాలనుకున్నారు? అంటూ ఫిలిం సర్కిల్స్ లో ఒకటే చర్చ మొదలైంది.
ఇంకా టాలీవుడ్ లో మరికొంత మంది సెలబ్రిటీలకు కూడా థాంక్స్ చెప్పారు మణి. మరి ఈ థాంక్స్ ల వెనుక అసలు కథ ఏంటన్నది తెలియాలి. ఇలా ఇంత మందికి కృతజ్ఞతలు చెబుతున్నారంటే? పొన్నియన్ సెల్వన్ వెనుక వాళ్లంతా కూడా కీలక పాత్రధారులుగా ఉన్నట్లే.
మరి అది సినిమా లో గెస్ట్ అప్పీరియన్సా రూపంలోనా? లేక సినిమా ప్రచార విషయంలో వెనుకుండి సహకరిస్తున్నారా? ఇంకేదైనా కథ ఉందా? అన్నది తెలియాలి. గంపా గుత్తుగా ఇంత వరకూ మణిరత్నం ఎప్పడు టాలీవుడ్ సెలబ్రిటీకు థాంక్స్ చెప్పింది లేదు. తొలిసారి నిన్నటి సన్నివేశం అందరికీ ఆశ్చర్యంగానే అనిపించింది.