Begin typing your search above and press return to search.
నటుడికి 52.. ఆమెకు 26.. అయినా పెళ్లి! కారణం చెప్పిన బ్యూటీ
By: Tupaki Desk | 11 Jun 2021 8:30 AM GMTకొంత మంది ఎవరు ఏమనుకుంటారో అనే విషయాన్ని అసలే పట్టించుకోరు. తమకు ఏది సరైందని అనిపిస్తే అది చేసేస్తారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్. ఆయన వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. మూడేళ్ల క్రితం అంటే.. 52 సంవత్సరాల వయసులో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి వయసు ఆయనలో సగం. అంటే.. సరిగ్గా 26 సంవత్సరాలు.
ఇంత వయసు తేడాతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ విషయం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తుండడం గమనార్హం. మిలింద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు అంకిత కొన్వర్. ఆమె.. మిలింద్ సోమన్ ఫ్యాన్ కూడా కావడం విశేషం. కాగా.. తాజాగా ఓ నెటిజన్ వీళ్ల వయసు తేడాపై అంకితను ప్రశ్నించాడు. వృద్ధుడిని పెళ్లి చేసుకోవద్దనే జనాల మూసధోరణి ఆలోచనను ఎలా ఫేస్ చేశారు? అని అడిగాడు.
దీనికి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. ‘‘సమాజంలో జరిగే అసాధారణ విషయాల గురించి తెలుసుకునేందుకు, మాట్లాడుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది అన్ని దేశాల్లోనూ ఉంది. అయితే.. నేను మాత్రం ఎప్పుడూ నాకు సంతోషాన్నిచ్చే పనులే చేశాను. చేస్తాను.’’ అని చెప్పింది.
ఇదిలాఉండగా.. అంకితకు గతంలో ఓ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతను మరణించడంతో ఒంటరిగా కుంగిపోయింది. ఈ క్రమంలోనే.. చెన్నైలోని ఓ హోటల్ లో వీరిద్దరూ కలిశారు. ఆ తర్వాత జీవితాంతం కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు.