Begin typing your search above and press return to search.

నందమూరి హీరో సినిమా ఇంత డల్ గానా ?

By:  Tupaki Desk   |   28 Feb 2019 6:51 AM GMT
నందమూరి హీరో సినిమా ఇంత డల్ గానా ?
X
రేపు పెద్దగా పోటీ లేకుండానే కళ్యాణ్ రామ్ 118 బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతోంది. అజిత్ విశ్వసం ఉన్నప్పటికీ అది డబ్బింగ్ మూవీ కావడం హీరోకు పెద్దగా మార్కెట్ లేని కారణాల వల్ల 118కే కాస్త ఎక్కువ ఎడ్జ్ దక్కుతోంది. అయితే ఆశించిన దాని కన్నా చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుపెట్టేసారు. ఎక్కడా కనీసం సగం నిండిన ట్రెండ్ కూడా కనిపించడం లేదు. శుక్రవారం కొత్త సినిమాకు ఉండాల్సిన జోష్ 118కు పూర్తి స్థాయిలో రావడం లేదు.

దీనికి ప్రధాన కారణం ప్రమోషన్ సరైన స్థాయిలో చేయకపోవడమే. స్టార్లను తీసుకొచ్చి ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినంత మాత్రాన జనం ఎగబడి రారు. మన సినిమా ఎప్పుడు వస్తోంది అందులో ఏముంది థియేటర్ దాకా రప్పించే కంటెంట్ ఇందులో ఉందని నమ్మకం కలిగించేలా ప్రేక్షకులకు తెలిసేలా పబ్లిసిటీ చేయడం చాలా అవసరం. అయితే 118 ఈ విషయంలో బాగా వెనుకబడిన మాట వాస్తవం. ఏదో ఒకటి అరా ప్రింట్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప యూనిట్ అంతకు మించి ఏమి చేయడం లేదు

వాస్తవానికి కళ్యాణ్ రామ్ బలం మాస్ మార్కెట్. స్వంత అన్నయ్య కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అండ తనకు ఉంది. కీలకమైన బిసి సెంటర్స్ లో సినిమాను తీసుకెళ్లడం చాలా ముఖ్యం. కానీ 118 టీమ్ ప్లానింగ్ లోపం వల్ల చాలా చోట్ల అసలు రేపు ఇది విడుదల అవుతోంది అన్న ధ్యాస కూడా లేకుండా సైలెంట్ గా వస్తోంది. బుకింగ్స్ విషయంలో వెనుకబడానికి ఇదే ప్రధాన కారణం. అసలే బజ్ తక్కువగా ఉన్న నేపధ్యంలో అగ్రెసివ్ ప్రమోషన్ చాలా అవసరం.

తోపు తురుము అనుకునే స్టార్ హీరోల సినిమాలకే వైరల్ ప్రమోషన్ తప్పడం లేదు. అలాంటిది గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్న కళ్యాణ్ రామ్ కు ఇంకెంత చేయాలి. ఇప్పటికైనా వెంటనే మేల్కొని కాస్త స్పీడ్ పెంచితే జనానికి తెలిసి అవును ఈ సినిమా వస్తోంది కదా అని అలెర్ట్ అవుతారు. కెవి గుహన్ దర్శకత్వం వహించిన 118లో షాలిని పాండే నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు