Begin typing your search above and press return to search.
ఆహాకి ఎందుకని బజ్ రాలేదు?
By: Tupaki Desk | 27 March 2020 3:30 AM GMTవిస్త్రతమైన ఫాలోవర్స్ ఉండే డిజిటల్- ఓటీటీ వేదిక సక్సెస్ కావాలంటే అందుకు ఎన్నో జాగ్రత్తలు అవసరం. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్! అంటారు. కానీ ఆ ఇంప్రెషన్ కొట్టేయడంలో `ఆహా` ఎందుకు ఫెయిల్ అయ్యింది? బాస్ అల్లు అరవింద్ లాంటి టాప్ రేంజ్ పర్సనాలిటీ ఈ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అడుగులు వేయాల్సి ఉన్నా ఎక్కడ తేడా కొట్టింది? అసలు ఆహాకు జనాదరణ లేకపోవడానికి కారణమేమిటి? అంటూ డిజిటల్ ఫ్యాన్స్ రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే వీటన్నిటికీ అట్నుంచి సమాధానాలైతే లేవు. ఒకరకంగా ఈ వైఫల్యానికి కారణాల్ని విశ్లేషిస్తే నాలుగైదు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. ఆహా - ఓటీటీ వేదికను సైలెంట్ గా ప్రారంభించిన టీమ్ పెద్దగా ప్రచారమేదీ చేయలేదు. పైగా దీనికోసం పెద్ద సినిమాలేవీ కొనలేదు. ఇక ఇందులో ఉన్న వెబ్ సిరీస్ లు ఏవీ అంత ఎఫెక్టివ్ గా లేనే లేకపోవడం నిరాశపరిచింది.
వీటన్నిటినీ మించి ప్రధానంగా ప్రమోషన్స్ వీక్ అన్న విమర్శ వెల్లువెత్తింది. ఒక చిన్న వెబ్ సైట్ ప్రారంభిస్తేనే బోలెడన్ని వాణిజ్య ప్రకటనలు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటున్న రోజులివి. కక్కుర్తి పడితే పనవ్వని సన్నివేశం ఈ కాంపిటీషన్ వరల్డ్ లో ఉంది. వాణిజ్య ప్రకటనల్ని ఇవ్వడంలోనూ వెనకబాటు కూడా అసలు ఆహా ఎవరికీ తెలియకపోవడానికి కారణం అని విశ్లేషణలో తేలింది. ప్రకటనలు ఇచ్చి బాగా పబ్లిక్ లోకి తీసుకెళ్లాల్సిన మాధ్యమం ఇది. కానీ అలా చేయనేలేదు ఎందుకనో. ఇంకా 60-70 శాతం పైగా తెలుగు ప్రజలకు అసలు ఆహా ఉందా? అన్నది తెలీనే తెలీదు. అందుకే ఇలా నిరాదరణకు గురవుతోందని విశ్లేషిస్తున్నారు. క్రేజీ సినిమాల్ని ఇందులో లైవ్ చేయాలి. వెబ్ సిరీస్ లు దమ్మున్నవి ఉండాలి. కంటెంట్ లేకపోతే అసలే చూసే సన్నివేశం లేదు. జనాలకు టైమ్ చాలా ఇంపార్టెంట్. అనవసరమైన వాటికోసం వేస్ట్ చేసుకునే తెలివితక్కువ పనులు అయితే చేయరు. ఈ విషయాన్ని ఆహా బృందం గమనిస్తుందేమో చూడాలి.