Begin typing your search above and press return to search.
రాక్షసుడు సౌండేది రాజా
By: Tupaki Desk | 31 July 2019 8:23 AM GMTఇంకో 48 గంటల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా రాక్షసుడు మొదటి షోలు పడబోతున్నాయి. తమిళ్ లో గత ఏడాది సెన్సేషనల్ హిట్ గా నిలిచిన రట్ససన్ కు ఇది ట్రూ రీమేక్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా రాజీవ్ కనకాల-సూర్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాధారణంగా బెల్లం హీరో సినిమాల ప్రీ రిలీజ్ ముందు చాలా హడావిడి ఉంటుంది. అది అల్లుడు శీను నుంచి సీత దాకా గమనించవచ్చు. ఏదీ అంచనాలు అందుకోలేకపోయింది. కానీ విచిత్రంగా ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టుతో సాయి శ్రీనివాస్ సినిమా చేస్తే దానికి ఎలాంటి బజ్ లేకపోవడం వింతే.
ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం తప్పితే ఇంకే రకంగానూ రాక్షసుడు మార్కెట్ లోకి ప్రమోట్ కావడం లేదు. ఇక్కడ మరికొన్ని కారణాలు గమనించాలి. ఇప్పటిదాకా సాయి శ్రీనివాస్ చేసిన మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా అందరూ టాప్ హీరోయిన్స్ తో చేశాడు. మొన్నటికి మొన్న స్టార్ హీరోలకే దొరకని పూజా హెగ్డేను సాక్ష్యం కోసం తీసుకొచ్చాడు. ప్రతిదాంట్లోనూ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండేవి. పని చేసిన దర్శకులందరూ ఫామ్ లో ఉన్నవాళ్లే.
కానీ రాక్షసుడికి ఇలాంటి ఆకర్షణలు ఏమి లేవు. కేవలం పోస్టర్లు ట్రైలర్ల పబ్లిసిటీ మీద ఆధారపడుతోంది. దీంతో ఇదో సినిమా వస్తోందన్న ఆలోచన కూడా అధిక శాతం ప్రేక్షకులకు రానంత వీక్ గా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటిదాకా చేసిన సినిమాలకు పబ్లిసిటీ చేసినా చేయకపోయినా అట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చెల్లేదేమో. కానీ రాక్షసుడు అవేవి చేయకుండా సైలెంట్ గా ఉండటం ఎల్లుండి ఓపెనింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరి ఎందుకు ఇంత నిర్లిప్తత ఉందో తెలుసుకుని సాయి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగితే తప్ప ఊపు రాదేమో