Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ ఫాలోయింగ్ భారీగా తగ్గిందనడానికి ఇదే నిదర్శనమా..?

By:  Tupaki Desk   |   13 March 2021 6:45 AM GMT
పవర్ స్టార్ ఫాలోయింగ్ భారీగా తగ్గిందనడానికి ఇదే నిదర్శనమా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా పవన్ సినిమాలు వసూళ్ళు రాబడుతుంటాయి. డిజాస్టర్ మూవీ సైతం భారీ ఓపెనింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్ వస్తుందంటే అభిమానులు పండగలా చేస్తుంటారు. కంటెంట్ ఏదైనా సరే కొన్ని రోజుల పాటు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో హ‌డావుడి కనిపిస్తుంది. యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. అప్పటి వరకు ఉన్న మిగతా హీరోల రికార్డ్స్ అన్నీ తుడిచిపెట్టుకొని పోతుంటాయి. అందులోను పవన్ రీ ఎంట్రీ సినిమాల అప్డేట్స్ అయితే ఏ రేంజ్ లో రెస్పాన్స్ ఉండాలి. అయితే ఇప్పుడు పవర్ స్టార్ సినిమాల నుంచి వస్తున్న కంటెంట్ విషయంలో ఇవేమీ జరగడం లేదని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఫ్యాన్స్ కు పునకాలు వచ్చేలా పవన్ ని చూపించాడని అందరూ కొనియాడారు. అయితే ఈ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చి 5 రోజులవుతున్నా ఇంకా 3.6 మిలియన్ వ్యూస్ దగ్గరే స్టక్ అయిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే సమయంలో ఆ తర్వాతి రోజు వచ్చిన కింగ్ నాగార్జున 'వైల్డ్ డాగ్' ట్రైలర్ దాదాపు 9 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియోలలో టాప్ లో కొనసాగుతోంది. 50.4K సబ్ స్క్రైబెర్స్ ఉన్న మెగా సూర్య ప్రొడక్షన్ ఛానల్ లో 'వీరమల్లు' గ్లిమ్స్ రిలీజ్ చేయగా.. కేవలం 26.2K సబ్ స్క్రైబెర్స్ ఉన్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో 'వైల్డ్ డాగ్' ట్రైలర్ విడుదల అవ్వడం గమనార్హం.

నాగ్ 'వైల్డ్ డాగ్' సినిమాకి నాలుగు రోజుల్లోనే అన్ని వ్యూస్ వస్తే.. పాన్ ఇండియా లెవల్ లో రానున్న 'వీరమల్లు' గ్లిమ్స్ కి అంత తక్కువ వ్యూస్ రావడం సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలానే 'వకీల్ సాబ్' విషయంలో కూడా ఇలానే జరుగుతోంది. పవన్ కంబ్యాక్ మూవీ కాబట్టి ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూడాలి. కానీ విడుదలకు నెల కూడా లేదు.. 'వకీల్ సాబ్' పై అసలు హైప్ కనిపించడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫాలోయింగ్ భారీగా తగ్గిందనడానికి ఇదే నిదర్శనమని.. రాజకీయాల్లోకి వెళ్లాక అతని విధి విధానాలు చూసి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాగా త‌గ్గిపోయారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.