Begin typing your search above and press return to search.

లీకైన వీడియోలో రాధికా ఆప్టే పేరే ఎందుకు?

By:  Tupaki Desk   |   17 Aug 2016 7:07 AM GMT
లీకైన వీడియోలో రాధికా ఆప్టే పేరే ఎందుకు?
X
పర్చేడ్ సినిమాకు సంబందించి తాజాగా లీకైన ఘాటైన సెక్స్ సీన్స్ దృశ్యాలకు పెట్టినపేరుపై ప్రశ్నిస్తున్నారు ఆదిల్ హుస్సేన్. ఆ దృశ్యాలకు "రాధికా ఆప్టే సెక్స్ సీన్" అనేపేరే ఎందుకు పెట్టారు.. "ఆదిల్ హుస్సేన్ సెక్స్ సీన్స్" అని అనొచ్చుగా? అనరు.. ఎందుకంటే ఈ దేశంలో పురుషుడు శృంగారంలో పాల్గొనడం పెద్ద విషయం కాదు! అని ఫైరయ్యారు ఆదిల్ హుస్సేన్. బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే తాజా సినిమా 'పర్చెడ్‌' సినిమాలోని కొన్ని ఘాటైన దృశ్యాలు లీకయ్యి ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో హీరోయిన్‌ రాధికకు సహనటుడు ఆదిల్‌ హుస్సేన్ అండగా నిలిచారు. ఈ దృశ్యాలు లీకవ్వడం సంగతి అటుంచి.. అసలు లీకైన వీడియోకు "రాధికా ఆప్టే సెక్స్ సీన్" అనే పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆదిల్.. లీకైన శృంగార దృశ్యాలను రాధిక పేరిట ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. ఆ దృశ్యాలను ఎందుకు "ఆదిల్ హుస్సేన్ సెక్స్‌ సీన్" అని పేర్కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ వీడియోలో తామిద్దరం నటించినా కూడా కావాలని రాధికను కించపరిచేలా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ దేశంలో మగాడు శృంగారంలో పాల్గొనడం పెద్ద విషయం కాదు కాబట్టి.. తన పేరుమీద ఆ వీడియో ప్రచారం చేయడంలేదు.. మనం నివసిస్తున్న పితృసామ్య వ్యవస్థ ఆలోచనే దీనికి కారణం. ఇదే పని మహిళ చేస్తే మాత్రం అంతాకలిసి రాద్దాంతం చేస్తారు. పాశ్చాత్య దేశాల్లోని సినిమాల్లో ఇలాంటి సీన్లు సర్వసాదారణం అని ఆదిల్ అన్నారు.

కాగా కొన్నిరోజుల కిందట ఇంటర్నెట్‌ లో లీకైన పర్చేడ్ సినిమాలోని హాట్ సీన్స్ ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ దృశ్యాలను ఎవరూ లీక్ చేశారు అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ వీడియో ద్వారా రాధికా ఆప్టే మరోసారి ఈవిదమైన వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు.