Begin typing your search above and press return to search.

RC15 ప్లేస్ లో విజయ్ సినిమాను రిలీజ్ చేస్తారా..?

By:  Tupaki Desk   |   11 April 2022 2:31 PM GMT
RC15 ప్లేస్ లో విజయ్ సినిమాను రిలీజ్ చేస్తారా..?
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో #RC15 మరియు #Thalapathy66 వంటి రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ ప్రతిష్టాత్మక చిత్రాలను ఇప్పటికే సెట్స్ మీదకు తీసుకెళ్లారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందే మైలురాయి 50వ సినిమా. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని దిల్ రాజు ఆ మధ్య ప్రకటించారు.

ఇక తమిళ హీరో విజయ్‌ నటిస్తున్న 66వ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ బైలింగ్విల్ ప్రాజెక్ట్ కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విజయ్ కు ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

అయితే 'తలపతి66' సినిమా కారణంగా దిల్ రాజు.. రామ్ చరణ్ చిత్రాన్ని ముందుకు జరిపే ఆలోచన చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2023 సంక్రాంతికి విడుదల చేయాలని.. RC15 చిత్రాన్ని సంక్రాంతికి కాకుండా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారని అనుకుంటున్నారు.

నిజానికి విజయ్ సినిమా కంటే RC15 చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్. RRR సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ జాతీయ స్థాయిలో పాకిపోయింది. ఇప్పుడు చెర్రీ తదుపరి సినిమాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండో ఆలోచన లేకుండా శంకర్ తో చేస్తున్న చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయొచ్చు.

కాకపోతే 2023 సంక్రాంతి సీజన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' సినిమా రిలీజ్ ఉంది. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మైథలాజికల్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న హైప్ ను బట్టి చూస్తే అదే సమయంలో మరో మూవీని రిలీజ్ చేయడం అంటే కాస్త రిస్క్ అనే భావించాలి.

దిల్ రాజు కూడా ఇలానే ఆలోచించి రామ్ చరణ్ సినిమాని సమ్మర్ సీజన్ కు జరిపాలని అనుకొని ఉండొచ్చు. కానీ విజయ్66 కూడా బహుభాషా చిత్రమే. తెలుగు తమిళంతో ఏకకాలంలో రూపొందే ఈ సినిమా ఇతర భాషల్లో డబ్బింగ్ చేయబడుతుంది. సంక్రాంతికి బరిలో దించాలంటే 'ఆదిపురుష్' ని ఎదుర్కోడానికి రెడీగా ఉండాలి. మరి అప్పటికి సమీకరణాలు ఏవిధంగా మారుతాయో చూడాలి.

కాగా, RC15 మార్క్ పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. కియరా అద్వానీ - అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

మరోవైపు తలపతి66 చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు.