Begin typing your search above and press return to search.
రాజమౌళి అన్నయ్య ఛాన్స్ ఎందుకు ఇవ్వరంటే.. MM శ్రీలేఖ
By: Tupaki Desk | 2 Dec 2022 5:46 AM GMTప్రస్తుతం సినిమా ప్రపంచంలో లేడీ మ్యూజిక్ డైరెక్టర్ అనేవారు పెద్దగా లేరు. కొంతమంది గతంలో వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ ఇండియా మొత్తంలో చూసుకుంటే కూడా మంచి కంపోజర్ గా చాలా సినిమాలు చేసిన మహిళ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎం ఎం శ్రీలేఖ ఒకరే కనిపిస్తారు. ఆమె ఎమ్ఎమ్ కీరవాణి సొంత చెల్లి. రాజమౌళి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా బయట సినిమాల్లోనే వర్క్ చేశారు.
రాజమౌళి అలాగే ఎంఎం కీరవాణి సినిమాలకు ఆమె సింగర్ గా వర్క్ చేసింది చాలా తక్కువే. ఇక ఇండస్ట్రీలో మాత్రం శ్రీలేఖకు వారి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి అవకాశాలు వస్తూ ఉంటాయి అని ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రాజమౌళి కొన్నిసార్లు అవకాశాలు ఇవ్వకపోవడంతో ఆమెతో విభేదాలు కూడా వచ్చాయి అని మరొక టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది.
అయితే ఎప్పుడు ఆ విషయంలో వారి కుటుంబ సభ్యులు స్పందించింది లేదు. ఎంఎం శ్రీలేఖ తన సొంతంగానే ఇండస్ట్రీలో 80 కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందించారు. వందల సినిమాల్లో పాడారు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి అన్నయ్య రాజమౌళి ఎందుకు అవకాశాలు ఇవ్వరు అనే విషయంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
శ్రీలేఖ మాట్లాడుతూ.. మా కుటుంబం మొత్తం కూడా వర్క్ పరంగా అయితే ఎవరి పని వాళ్ళదే. కుటుంబ పరంగా మాత్రం మేము అందరం కలిసే ఉంటాం. కానీ ఎప్పుడు ఎవరికి అవకాశాలు ఇవ్వాలి అనేది దర్శకుడుగా మ్యూజిక్ డైరెక్టర్గా మా అన్నయ్యల సొంత నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ నేను వారికి ఉపయోగపడతాను అంటే అందులో ఏమాత్రం సందేహించకుండా అవకాశం ఇస్తారు.
నేను సొంతంగా ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించాను. ఇక రాజమౌళి కీరవాణి గారి కాంబినేషన్ సెట్ అయింది కాబట్టి వాళ్లు ఆ కాంబినేషన్ వదులుకోరు. అంతేకాకుండా రాజమౌళి అన్నయ్యకు ఎప్పుడు ఎవరిని ఎలాంటి పనికి ఉపయోగించుకోవాలని బాగా తెలుసు. నాకు కూడా ఆయన ఒక రోజు అవకాశం ఇస్తారేమో.. చెప్పలేము అని శ్రీలేఖ తెలియజేసింది. అయితే మా కుటుంబాల మధ్యలో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో కూడా ఇలాంటి విజయం లేదు అని కూడా శ్రీలేఖ తెలియజేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.