Begin typing your search above and press return to search.
నటకిరీటి వారసుడు హీరో అవ్వలేదేం?
By: Tupaki Desk | 3 July 2019 5:30 PM GMTనటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ ని చూస్తున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్టుగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీ టాప్ సినిమాలన్నిటా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆయన నటించిన `ఓ బేబి` ఈనెల 5న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాకు ఇద్దరు గాళ్ ఫ్రెండ్స్. సమంత- లక్ష్మీ ఇద్దరూ స్నేహితురాళ్లు అని చెబుతున్న ఆయన రోమియో తరహాలో ఆసక్తికర పాత్రలో కనిపించనున్నారు.
నేడు హైదరాబాద్ లో `ఓ బేబి` ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రకరకాల సంగతులు ముచ్చటించిన రాజేంద్రుడు అసలు ఒక సినిమాతో ఇంకో సినిమాకి సంబంధం లేకుండా అన్నీ వెరైటీ పాత్రలే చేస్తున్నానని వెల్లడించారు. ఇంతకీ మీ నటవారసుడు తెరంగేట్రం చేసేది ఎప్పుడు? అని ప్రశ్నిస్తే.. తన వారసుడు బాలాజీ ప్రసాద్ పరిశ్రమకు రాకపోవడానికి గల కారణమేంటో రివీల్ చేశారు. బాలాజీ వయసు ఇప్పటికే 35. ఈ వయసులో ఇంకా ఏం వస్తాడు? అని అన్నారు. అయినా బాలాజీకి నటించే ఆసక్తి లేదు. అందుకే హీరోగా పరిచయం చేయలేదని తెలిపారు.
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా పరిచయం చేసిన ది గ్రేట్ నిర్మాత రామోజీ రావు సారథ్యంలో వెండితెరకు పరిచయం చేయాలని భావించాం. ఆయన బ్యానర్ లోనే కథ కూడా రెడీ చేయిద్దామని రెడీ అయ్యారు. ఎన్టీఆర్ తరహాలోనే మావాడు పరిచయం కావాలని భావించాం. కానీ తనకు నటన ఇష్టం లేదని అన్నాడు. దాంతో బలవంతం చేయలేదని రాజేంద్రుడు తెలిపారు. మద్రాసుతో అనుబంధం ఎక్కువ. అందుకే తమిళనాడులో ... అలానే ఆస్ట్రేలియాలోనూ రకరకాల బిజినెస్ వ్యాపకాలతో బాలాజీ ప్రసాద్ బిజీగా ఉన్నారని వెల్లడించారు. నిరంతరం నటవారసుల రాక గురించి ప్రస్థావిస్తున్న ఈరోజుల్లో... ఒక నటదిగ్గజం వారసుడు అసలు ఈ గ్లామర్ & గ్లిజ్ ప్రపంచంలోకి రాకుండా పూర్తిగా డిఫరెంట్ వరల్డ్ లో ఉండడం అన్నది విచిత్రమే.