Begin typing your search above and press return to search.
ఈ ఎదురుచూపులు ఎందాక చరణ్ ?
By: Tupaki Desk | 31 May 2019 4:50 AM GMTమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తనకంటూ స్వంత స్టార్ డంను సృష్టించుకుని దూసుకుపోతున్న రామ్ చరణ్ నిర్మాతగా ఖైది నెంబర్ 150 నుంచి అదనపు బాద్యతలు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత బయటికి కనిపించని ఒత్తిడి అతని మీద బాగా పని చేస్తున్నట్టుంది. సైరా విషయంలో జరుగుతున్న ఆలస్యం ఇప్పటికే మెగా ఫాన్స్ ని కలవరపెడుతూ ఉండగా రిలీజ్ డేట్ విషయంలో యూనిట్ తప్ప మొత్తం ప్రపంచం మాట్లాడుకోవడం కూడా చరణ్ పట్టించుకోకపోవడం సమస్యను ఇంకా పెంచుతోంది.
ఇప్పటికే రెండేళ్ళు దాటినా సైరా ప్రోగ్రెస్ ఇదుగో అదిగో అంటున్నారే తప్ప ఇది ఫైనల్ ఫలానా తేదికి గుమ్మడి కాయ కొట్టేసి ఆ డేట్ కి రిలీజ్ చేస్తామని ధైర్యంగా ప్రకటించలేకపొతున్నారు. ఎప్పుడో వచ్చే ఆర్ ఆర్ ఆర్ ని వచ్చే ఏడాది జూలై 31 అని రాజమౌళి అంత ధీమాగా చెప్పెసినప్పుడు సైరా చివరి స్టేజి లో కూడా ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు అభిమానులు
ఇదంతా ఒక ఎత్తు అయితే సైరా ఫినిషింగ్ కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న కొరటాల శివ ఇప్పటికే ఏడాది నుంచి వెయిటింగ్ లో ఉన్నాడు . అది పూర్తవ్వడం ఆలస్యం స్క్రిప్ట్ తో సహా అంతా సిద్ధం చేసుకున్నాడు. చిరు డేట్స్ పక్కా చేస్తే చాలు హీరొయిన్ల తో సహా మిగిలిన క్యాస్టింగ్ ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది. ఆరు నెలల డెడ్ లైన్ తో ఖచ్చితంగా పూర్తి చేసే ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడట.
మరి దీని గురించీ సరైన అప్ డేట్స్ అందటం లేదు. చరణ్ ఇకపై ఆర్ ఆర్ ఆర్ లో మరింత బిజీ అవుతాడు. ఏ మీడియాకు దొరికేలా లేడు. ఆలోగా డాడీకి సంబంధించిన ఈ రెండు సినిమాల గురించి స్పష్టమైన సమాచారం ఇస్తే మెగా ఫ్యాన్స్ టెన్షన్ ని పూర్తిగా తగ్గించినట్టే